header

మహాకాళి దేవాలయం, ఉజ్జయనీ... Maha Kali Devi Temple in Ujjain

Mahakali Temple Ujjain మహాకాళి దేవాలయం, ఉజ్జయనీ... Maha Kali Devi Temple in Ujjain
సతీదేవి మోచేయి పడిన ఈ ప్రాంతం శక్తిపీఠంగా పేరుపొందింది. ఈ క్షేత్రం సప్తమోక్ష క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ శివుడి పేరు మహాకాళేశ్వరుడు. జ్యోతిర్లింగ స్వరూపుడు. దేవి పేరు మహాకాళి.
తారకాసురుకి ముగ్గురు కుమారులు ఉండేవారు. వారు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు. వీరు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి గాలిలో ఎగిరే మూడు పట్టణాలను వరంగా పొందుతారు. ఆ పట్టణాలతో వారు రాజ్యాల మీద వాలి రాజ్యాలను ధ్వంసం చేస్తుంటారు. వీరి బాధలు పడలేక దేవతలు బ్రహ్మతో కలిసి శివభగవానుడు దగ్గరకు వెళ్ళి ఈ ముగ్గురుని వధించమని కోరతారు.
అప్పుడు శివుడు భూమిని రథంగా, మేరు పర్వతం ధనస్సుగా, విష్ణువుని బాణంగా చేసుకొని ఆ ఒకే ఒక్క బాణంలో మూడు నగరాలను ఏకకాలంలో నాశనం చేస్తాడు. ఈ ప్రదేశమే ఉజ్జయనీగా ప్రసిద్ధి పొందినది.
ఇదే ప్రాంతంలో దూషణుడు అనే రాక్షసుడు ఊరివారిని తినసాగాడు. ఈ ప్రాంతంలో చాలాకాలంగా తపస్సు చేసుకొంటున్న ఒక బ్రాహ్మణుడు ఈ రాక్షసుని దారుణాలు చూడలేక మహాకాళేశ్వరుని ప్రార్ధిస్తాడు.
అపుడు శివుడు బ్రాహ్మణునికి అభయమిచ్చి, మహాకాళిని స్మరిస్తాడు. మహాకాళి ఊగ్రరూపంతో ప్రత్యక్షమవుతుంది. శివుడు ఆమెను చూసి దేవి దూషణుడను రాక్షసుడు వరగర్వంతో ధర్మానికి హాని చేస్తున్నాడు. వీడు ఏ పురుషుడి చేతిలోనూ మరియు ఏ ఆయుధంతోనూ మరణించడు.ఒక్క రక్తపు చుక్క నేలమీద పడినా ఈ రాక్షసుడు మరణించడు. కనుక వీడిని సంహరించమని చెబుతాడు.
అపుడు మహాకాళి దూషణుడుని తన గోళ్ళతో చీల్చి వాడి రక్తాన్ని కిందపడకుండా తాగివేసి దూషణుడని సంహరిస్తుంది. తరువాత ఆ బ్రాహ్మణ భక్తుని కోరిక మీద అక్కడే మహాకాళేశ్వరుడి పక్కనే మహాకాళిగా వెలుస్తుంది.
చూడదగిన ప్రాంతాలు : శ్రీ మహాకాళేశ్వర ఆలయం, విఘ్నేశ్వరాలయం, చింతామణి గణపతి, సిద్ధవట వృక్షం, భర్తృహరి గుహ, గడ్ కాళికాలయం, గోపాల మందిరం, సాందీపుని ఆశ్రమం, కలియాదే ప్యాలెస్ మొదలైనవి.
ఎలా వెళ్ళాలి ? పూర్వకాలంలో అవంతీపురంగా పేరుపొందిన ఉజ్జయనీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సిప్రా నది ఒడ్డున ఉంది. రైలు మార్గంలో విజయవాడ-వరంగల్-నాగపూర్-భోపాల్ మీదుగా ఉజ్జయనికి వెళ్ళవచ్చు. దగ్గరలో ఉన్న విమానాశ్రయం ఇండోర్. వసతికి ధర్మశాలలు, అతిధి గృహాలు, రైల్వే విశ్రాంతి గదులు కలవు.

Maha Kali Devi Temple in Ujjain

Aadi Shakti, Maha Kali is worshipped in this temple. Popularly known as Hara Sidhi Mata temple, this pristine abode is located on a small hillock by the holy river Kshipra in the historical district of Ujjain, Madhya Pradesh. A city associated with a number of Hindu myths, Ujjain was the royal seat of Vikramaditya and Devi Mahakali was the presiding deity of his kingdom. The upper lip of Sati fell here and the deity is worshipped in her fierce form. The deity is also known to the local devotees as Garh Kalika; Mahalaxmi and Saraswati are also worshipped along with her. Remarks: Chaitra Navratri and Ashwin Navratri are the two most important festivals that are held in this temple. During daily offerings, Madira(alcohol) is presented to the deity.
How to reach:
By Rail : Nearest railway Station; Ujjain. This temple is in Bherugarh, near River Kshipra, in Ujjain, Madhya Pradesh. Railway track and is well-connected to major Indian cities by direct train.
By Air : Nearest airport is in Indore, which is 50 kms away.