పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను, ముల్లోకాలను పీడించగా అష్టాదశ భుజములతో అవతరించిన
దేవి ఆ రాక్షసుని సంహరిస్తుంది. . అప్పడు దేవలతలు అమ్మవారిని తమకు ఆపద కలిగినపుడు రక్షించవలసిందిగా కోరతారు. అమ్మవారు పెన్నానదీ తీరంలో పద్మావతం అనే పురంలో స్థిరంగా వెలసింది.
ఈ నగరాన్ని పూర్వ యదు పుత్రుడైన పద్మర్ణుడు నిర్మించాడు. ఇలా వుండగా ఒకప్పుడు బ్రహ్మదేవుడు మానస సృష్టి చేస్తూ గయుడు, లవణుడు, కోలహుడు అనే ముగ్గురు మానసపుత్రులను సృష్టించాడు.
వీరు ముగ్గురూ మహాశక్తివంతులయ్యారు. కానీ కారణాంతరాల వల్ల విష్ణువు వీరిలో గయ, లవణులను సంహరిస్తాడు. ఈ సందర్భంగానే గయా క్షేత్రం ఏర్పడింది.
ఈ సోదర త్రయంలో కోలాహుడు మూడవవాడు. కోలాహుడు అనగా అడవి పందులను చంపేవాడు అని అర్థం. మహావీరుడని మరో భావం. ఈ పదమే కొల్హా అయినది. పద్మవతి పుర చక్రవర్తి కొల్హుడు.
బ్రహ్మపుత్రుడు కనుక తపస్సతోనే దేవతలను గెలవాలని నిశ్చయించుకున్నాడు. తడు తీవ్రమైన తపస్సులో ఉండగా సుకేశి అనే రాక్షసుడు ఇతని రాజ్యాన్ని ఆక్రమించి, ధర్మవ్యవస్థను చిన్నాభిన్న చేసి, దేవతలను కూడా పీడించ
సాగాడు. కొల్హుడు వరాలు పొంది రాజ్యానికి వచ్చేసరికి రాజ్యం అన్యాక్రాంతమై ఉంది. కొల్హుడు సుకేశుడితో యుద్ధంచేసి సుకేశుని సంహరిస్తాడు.
రాజ్యపాలనలో కొల్హుడు ధర్మపరిపాలకుడని పేరు పొందాడు. కానీ దేవతల మీద ద్వేషంతో దర్మాన్ని ధ్వంసం చేసే పనులు చేయసాగాడు. దేవతలు మహాలక్ష్మిని ఆశ్రయిస్తారు. దేవసేన సమేతంగా దేవి
యుద్దానికి వస్తుంది. యుద్ధంలో కొల్హుడు దేవి చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. అతనిలో ఉన్న జ్గ్నానం వలన దేవిని స్తుతిస్తాడు. మరణావస్థలో ఉన్న కొల్హుడుని అమ్మవారు అనుగ్రహించి మూడు వరాలిస్తుంది.
అతని పేరు మీద ఈ నగరం కొల్హాపురిగా పేరుగాంచినది. రెండవ వరం అమ్మవారు ఈ ప్రాంతంలో మహాలక్ష్మిగా వెలసింది. ఈ క్షేత్రాన్ని ప్రసిద్ధం చేయడం ఇంకో వరం. వరాలిచ్చిన తరువాత అమ్మవారు
కొల్హుని బ్రహ్మాస్త్రంలో సంహరించుతుంది.
దర్శనీయ ప్రాంతాలు :
ప్రాచీన కాలంనాటి ఈ దేవాలయం అద్భుతమైన శిల్పకళాసౌందర్యంతో విరాజిల్లతుంది. ఈ దేవాలయ ప్రాంగణంలో సాక్షి గణపతి, సూర్యభగవానుడు, విఠలుడు, రాధాకృష్ణ, స్వామి సమర్ధ, నవగ్రహాలు,
దత్తాత్రేయుడు, శంకరాచార్య విగ్రహాలను ప్రతిష్టించారు. అలాగే అమ్మవారి మందిర ప్రాంగణంలో 64 మంది యోగిని దేవతల విగ్రహాలు కనువిందు చేస్తాయి.
కపిలేశ్వరుడు : ఈ నగరానికి క్షేత్రపాలకుడు కపిలేశ్వరుడు కనుక ముందుగా ఈ స్వామిని దర్శించిన తరువాతనే మహాలక్ష్మి అమ్మవారిని దర్శించాలి లేదా దర్శనాఫలితం దక్కదంటారు.
భవానీ మండపం : దీనిని ఛత్రపతి శివాజీ నిర్మించాడు. భవనం మధ్యలో మహాకాళి : ఈ క్షేత్రానికి అధిష్టాన దేవత మహాకాళి. ఈమెను యుద్ధ దేవతగా ఆరాధిస్తారు.
పంచగంగ : ఇక్కడ గంగ ఉద్భవించి భాగీరధి, శివ, కుంభీ, సరస్వతీ (అంతర్వాహిని) నదులతో సంగమిస్తుంది. కనుక ఈ పంచగంగా క్షేత్రాన్ని ప్రయోగ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం మకర సంక్రమణం
సందర్భంలో ఇక్కడ బ్రహ్మాండగా ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ పిండ ప్రధానం చేసిన వారి వంశం తరిస్తుందంటారు.
Mahalaxmi Devi Temple in Kolhapur, Maharashtra
Popularly known as Shree Pitham, this glorious temple is the seat of Kolhapureshwari ). It is believed that the eyes of Sati fell here. Among the other idols there is a difference between the commonly found Laxmi idol and the image found in this temple. Here the lion is portrayed as the mount of the deity. In Mahalaxmi Temple of Kolhapur, the idol of the deity is carved in black stone and she has four hands holding a mhalunga (a citrus fruit) a Kaumudoki (large mace), a khetaka (shield) and a panpatra. The main attraction of the temple is a small open window on the western wall through which rays of the setting sun fall directly on the deity’s face on the 21st of each March and September.The temple belongs architecturally to the Kannada Chalukya empire and was first built in the 7th century
Festivals: There are six fixed days in each year when sunrays enlighten different parts of the idol of the deity. On those days Kiranotsava Festival is organized.
How to go : By Air : Ujalaiwadi Airport is 10 kms from the main city of Kolhapur.
By train, it is a 10 to 11 hour journey from Mumbai or Bangalore. There are several day and night trains that leave Dadar or Chhtrapati Shivaji Terminus, Mumbai for Kolhapur.
AP People : from Hyderabad - Kolhapur - by trains
By Road Kolhapur is 395 kms from Mumbai and 225 kms from Pune.
Official Website : Mahalakshmi Temple