తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం మండలానికి చెందిన గ్రామము. కాకినాడకి 32 కి.మీ దూరములోను, రాజమండ్రికి 60కి.మీ దూరములోను ఉన్నది. ద్రాక్షారామంలో గల శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. ఈయన దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసియున్నది. మన రాష్ట్రానికి త్రిలింగ దేశమని పేరు రావడానికి కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరము కాగా, మరొకటి శ్రీశైలము. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది. శిల్ప కళాభిరామమై, శాసనాల భాండాగారమై ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం ఒప్పారుతోంది.
Manikyamba devi Temple become popular for its unique idol of the deity. Devi Looks Always to the Left and it is believed that the deity was initially worshipped by the Bamachari sect of Hinduism and that is why the eyes of the idol are slightly tilted towards left. According to the Devi Purana, the left cheek of Sati fell here. Another legend states about the association of the deity with prostitutes and that is why she is also known as the Kuldevi of sex workers of that region.
Special : Friday is an important day for Manikyamba devi Temple, as on this day Kumkumarchana is done. Every Ekadashi, ekanta seva of Lord Bhimeswaraswamy and Manikyamba devi is performed.