పురూహూతికాదేవి – పిఠాపురం : దాక్షాయణీదేవి పీఠభాగం ఇక్కడ పడటం వలన పీఠికాపురం అనే పేరు వచ్చింది. పీఠికాపురమే క్రమ్రకమంగా పిఠాపురంగా మారిందంటారు. ఈ ఆలయం ఎదురుగానే కుక్కుటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ శివలింగం స్వయంభువు. దత్తాత్రేయిని ప్రథమ అవతారంగా భావించే శ్రీపాదవల్లభుడు పిఠాపురంలోనేనని పురాణ కథనం. పిఠాపురం వైష్ణవక్షేత్రం కూడా. పిఠాపురం త్రిగయల్లో ఒకటి.గయాసురుడనే రాక్షసుడు విష్ణువు కృపకోసం తపస్సుచేసి తన దేహం పవిత్రమైనదిగా చేయాలని కోరాడట. అతడి కోరిక ప్రకారం అతడి దేహంపై యజ్గ్నాన్ని ఆరురోజులపాటు నిర్వహించారు. గయాసురుని పాదభాగం ఇక్కడ ఉండటం వలన ఈ ప్రాంతానికి పాదగయ అనే పేరు వచ్చింది. ఎలావెళ్ళాలి : పిఠాపురం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 62 కి.మీ. సామర్లకోటకు12 కి.మీ దూరంలో ఉంటుంది. ప్రధానమైన రైళ్ళు అన్నీ పిఠాపురంలో ఆగుతాయి.
Puruhutika Devi Temple is a destination to get rid of all sins. Found amidst a couple of other temples, this is a shrine of Mother Goddess where the left hand of Sati was supposed to have fallen. Padagaya one of the tree gayas is locted here. Puruhutika Devi is believed to be the consort of Kukkuteshwara Swamy. The goddess Puruhutika is appears here with four hands holding a bag of seeds , axe , lotus and a dish from lower-right to lower-left in order.
Other attractions : One should have a look at the temples of Hunkruthi Durga, Rajarajeswari temple, Kunthi madhava temple and Sripada Srivallabha Dattatreya temple.