శారదా పీఠం
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులో నీలం నది ఒడ్డున గల సరస్వతీ దేవి శక్తిపీఠం వద్ద ఉండేది. నీలం నదిని భారతదేశంలో కిషన్‌గంగ అని పిలుస్తారు. అయితే, ప్రస్తుతం ఆలయ శిథిలాలు తప్ప మరేమీ లేవు.
ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకి చేరువలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులోని నీలం జిల్లాలో ఉన్నది. ఇక్కడ షీనా, కాశ్మీరీ భాషలు ఎక్కువగా మాట్లాడతారు. ఈ ఆలయం వల్లనే కాశ్మీరుని శారదాదేశంగా కూడా పిలుస్తారు.
ఇది ఒకప్పుడు కాశ్మీరీ పండితుల విద్యాకేంద్రంగా విరాజిల్లినది. ఇక్కడే ఆది శంకరుడు సర్వజ్ఞానపీఠాన్ని అధిష్టించాడు. ఒకప్పుడు సంస్కృత పండితులకు, కాశ్మీరీ పండితులకు; హిందూ, బౌద్ధ ధర్మాలకూ నిలయంగా ఉండేది.
ఇక్కడి శారదా దేవినే, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరైన సరస్వతీ దేవిగా కొలుస్తారు. ఇక్కడి శారదాదేవి లేదా సరస్వతీ దేవికి చెందిన స్తోత్రం
జ్ఞానప్రదా సతీమాతా కాశ్మీరేతు సరస్వతీ
మహావిద్యా మహామాయా భక్తిముక్తిప్రదాయినీ
ప్రస్తుతం ఈ పీఠం, ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. కొంతమంది కాశ్మీరీ పండితులు ఆలయ సందర్శనకీ,
మరమ్మత్తులకీ అనుమతినివ్వమని ఇటు భారతదేశానికీ, జమ్మూ కాశ్మీరుకీ; అటు పాకిస్తాన్ కీ, ఆజాదు కాశ్మీరుకీ విజ్ఞప్తులు చేసుకుంటున్నారు
This Temple is located near Sharda in Azad Kashmir , at the de facto border of India and Pakistan (Line of Control) , was the famous temple of the goddess Sarasvati (Sharda) on the banks of Neelum River in Azad Kashmir. Its ruins are near the Line of Control between the Indian and Pakistani-controlled portions of the former princely state of Kashmir and Jammu. Shina, Pahari, and Kashmiri languages are mostly spoken in the area. Kashmir was a high established centre of learning of vedantic works until Muslim invaders from central-Asian countries destroyed it. Indegenious script of Kashmir is named after the deity Sharada Devi. Kashmir was sometimes called Sharada Desh because of this temple and Sharada was called Kashmira Puravasini (resident of city of Kashmir).The Kashmiris are highly devoted towards this great deity addressed as Bhagavathy. During their daily worship they often say "Namastey Sharada Devi Kashmir Pur Vasini Tvam Ham Prartheye Nityam Vidya Danam Che De hi mey" meaning Salutations to you, O Sharada, O Goddess, O one who resides in Kashmir. I pray to you daily, please give me the charity of knowledge.
The temple (ruins) is located in a village called Sharda, in Neelam Valley, at a distance of 60 miles from Baramulla and about 16 miles
from line of control