
Mangala Gowri Temple..... Gayaమాంగల్య గౌరి – గయ
ఫల్గు నదీతీరంలో కోలాహలమనే పర్వతం మీద గయిడనే రాక్షసుడు ఘోర తపస్సు చేస్తూ ఉండేవాడు. ఇంద్రుడు గయుడి తపస్సుకు భయపడి బ్రహ్మను శరణు వేడుతారు. బ్రహ్మ గయుడికి వరాలిచ్చే శక్తి తనకు లేదన్నాడు.
ఇంద్రుడు శివుడి దగ్గరకు వెళ్ళగా శివుడు కూడా అదే మాటంటాడు. ఆ తరువాత విష్ణువు దగ్గరకు వెళ్ళగా విష్ణువు గయాసురుడి దగ్గరకు వెళ్ళి శంఘంతో గయాసురుణ్ని తాకుతాడు.
గయాసురుడు తపస్సు నుంచి మేల్కొని విష్ణువుకి సాష్టాంగ ప్రమాణం చేస్తాడు. విష్ణువు గయాసురుణ్ణి వరం కోరుకోమనగా గయాసురుడు తనకే కోరికలు లేవన్నాడు. కాదు కోరుకావాల్సిందే నని విష్ణువు చెప్పగా అలా అయితే నన్ను తాకిన ప్రతి జీవి, చూసిన ప్రతి జీవి మోక్షాన్ని పొందేలాగా కోరుకుంటాడు. విష్ణువు తధాస్తు అంటాడు..
ఈ గయాసురుడు తన శరీరాన్ని కొన్ని వందల మైళ్ళ పర్యంతం పెంచుతాడు. దాంతో ఎక్కడెక్కడి జీవులు, పురుగులు కూడా గయాసురుణ్ణి చూసి, తాకి మోక్షం పొందసాగాయి. స్వర్గానికి గాని నరకానికి గానీ వచ్చే జీవులు లేకుండా పోయి స్వర్గ నరకాలు రెండూ ఖాళీ అవుతాయి.
దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి తరుణోపాయం తెలుపమని వేడుకొనగా బ్రహ్మ దేవుడు గయాసురుని దగ్గరకు వెళ్ళి తాను చేయదలచిన యాజ్గ్నానికి గయాసురుని శరీరాన్ని ఇవ్వమని అడుగుతాడు. స్వయంగా బ్రహ్మదేవుడే కోరటంచేత అది మహాభాగ్యంగా భావించి గయాసురుడు ఒప్పుకొంటాడు.
అప్పడు బ్రహ్మ గయాసురుణ్ణి చూసి యజ్గ్నం జరిగేటప్పుడు ఆ వేడికి నీ శరీరం కదులుతుంది కనుక కదలకుండా ఉండమని అడుగుతాడు. దానికి గయాసురుడు కదలకుండా చూసుకునే భాద్యత మీదే అని అంటాడు.
తరువాత గయాసురుడు పడుకోగా అతని తల కోలాహ పర్వతం వద్దకు, పాదాలు (పీఠికాపురం) పిఠాపురం వద్దకు వస్తాయి. గయాసురుని వక్షస్థలం మీద కట్టెలు వేసి బ్రహ్మ యజ్గ్నం మొదలు పెడతాడు .యజ్గ్నంలో నుండి వచ్చే వేడికి గయాసురుడు అప్రయత్నంగా కదలసాగాడు. అపుడు బ్రహ్మదేవుడు యముడిని పిలచి మీ లోకములో వున్న పెద్ద ధర్మశిలను తెచ్చి గయిడి తలమీద పెట్టమన్నాడు. యమడు అలా చేసినా కూడా గయుడు కదులుతూనే ఉన్నాడు. అపుడు బ్రహ్మదేవుడు ఆ ధర్మశిల మీదకు విష్ణువుని ఆవాహన చేస్తాడు.
వెంటనే విష్ణువు సకల దేవతల సమేతంగా వచ్చి ధర్మశిలపై నిలబడ్డాడు. బరువుకి గయిడు కదలలేకపోతాడు. అగ్నిభాధను, సకల దేవతల బరువును సంతోషంగా సహిస్తూ ఉన్న గయాసురుని చూసి విష్ణువు ఏదైనా వరం కోరుకొమ్మంటాడు.
’’దేవా నా తలపై నీ పాదాలు ఇలాగే శాశ్వతంగా ఉండనీ. ఈ శిల బరువుకి నేను భూమిలోకి పోయి ప్రజలు నన్ను చూడటానికి వీలు కాదు. కానీ నా తలపై నిలచిన నీపాదాలను చూసిన వారికి ఉత్తమ గతి కలుగునట్లు వరమివ్వమంటాడు. నీ పాద క్షేత్రాన్ని నాపేరు మీదుగా స్మరిస్తూ ఇక్కడే కాకుండి ఎక్కడ పిండ ప్రధానం చేసినా సరే, ఆ వంశం వృద్ధి చేందేటట్లు మరియు తనకు ఆయుష్షు తీరగానే మోక్షమివ్వమని వరమడుగుతాడు. విష్ణువు ఆనందంగా తధాస్తు అని దీవిస్తాడు.
అప్పటి నుండి గయ పిండప్రధానమై క్షేత్రంగా పేరు పొందినది. ఈ ప్రాంతంలోనే సతీదేవి యొక్క శరీరభాగం పడటం చేత శక్తిపీఠంగా మారింది. సర్వమంగళాలను ప్రసాదించే ఈ తేజోమూర్తిని దేవతలు, మునులు సర్వమంగళాదేవి అని కీర్తించారు.
ఎలావెళ్ళాలి ?
బీహార్ రాష్ట్రం లో ఉన్న గయకు విజయవాడ-వరంగల్-నాగపూర్- ఇటార్సీ- అలహాబాద్ మీదుగా గయకు వెళ్ళవచ్చు. బీహార్ రాజధాని పాట్నాకు సుమారు 100 కి.మీటర్ల దూరంలో గయ ఉంది
The Mangla Gauri temple in Gaya, Bihar, India has been mentioned in Padma Purana, Vayu Purana and Agni Purana and
in other scriptures and tantric works .This temple is among the eighteen maha shakti peeth. The present temple dates back to 15th
century. The shrine is dedicated to Shakti or the mother Goddess in the predominantly Vaishnavite pilgrimage center of Gaya. Mangalagauri
is worshiped as the Goddess of benevolence. This temple constitutes an Upa-Shakti Pitha - where it is believed that a part of the body of
Shakti fell - according to mythology. Here Shakti is worshiped in the form of a breast symbol, a symbol of nourishment. It is believed that
whoever comes to maa durga with his wishes and prayers, returns successfully with all of prayers and wishes come true.