header

Shrinkala Devi, Pradyumnam..ప్రద్యుమ్నం శృంఖలా దేవి

Shrinkala Devi, Pradyumnam..ప్రద్యుమ్నం శృంఖలా దేవి

ఈ క్షేత్రంలో వెలిసిన దేవీ విగ్రహంలో కనిపించే మాతృప్రేమను అర్ధం చేసుకోలేని సాధకులకు ఇది శృంగార క్షేత్రంగా కనిపించేది. కనుక పూర్వంకాలం నాటి గురువులు తమ శిష్యులలో నిర్వికారులైన ఉత్తమమైన వారిని మాత్రమే ఈ క్షేత్రదర్శనానికి అనుమతించేవారు. దీనికి పురాణకాలం నాటి కథ ఒకటి ఆలంబనగా ఉంది.
త్రేతాయుగంలో దశరథుని పుత్రిక ఐన శాంతను వివాహం చేసుకున్న రుష్యశృంగ మహర్షి సతీసమేతుడై దేవిని చాలాకాలం ఉపాసించాడు. ఆయనకు దేవి యొక్క విచిత్రమైన ఆజ్గ్న మనస్సులో వినిపించసాగింది. అపుడు రుష్యశృంగ మహర్షి అక్కడనుండి దక్షిణ పశ్చిమ దిశగా వచ్చాడు. శృంఖలాదేవి యొక్క దివ్వశక్తి రుష్యశృంగ మహర్షిలో ఉంది. అలా వచ్చిన మహర్షి శృంగగిరి శిఖరపై తపస్సు చేసి ఆత్మానందం పొందుతాడు. తరువాత ఆ శృంగగిరి ప్రాంతంలో కొన్ని శక్తి క్షేత్రాలను ఏర్పరచి వాటిలో శృంఖలాదేవి శక్తిని భాగాలుగా స్థాపించుతాడు. శృంగ మహర్షి స్థాపించిన దేవతలు కనుక సాథనికులు దేవతలను శృంఖలా దేవతలుగా పిలిచారు. కలియుగంలో ఆదిశంకరాచార్యులు శారదాదేవి విగ్రహాన్ని మహిష్మతీ నగరం నుంచి తీసుకొని వస్తూ శృంగగిరి ప్రాంతానికి వస్తాడు. ఇక్కడ అమ్మ శక్తితరంగాలకు లోనవుతాడు. తరువాత ఈ ప్రాంతంలోనే శారదా మాతను ప్రతిష్టిస్తాడు.
ప్రదుమ్మనం పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ ప్రాంతమని పండితుల అభిప్రాయం. కాని పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ గాను బెంగాల్ గాను విడిపోయింది. ఇక్కడ రెండు ప్రాంతాలలోనూ శృంఖలాదేవి క్షేత్రం ఎక్కడా కనపడదు. శృం ఖలా దేవి క్షేత్రంపై భిన్నాభిప్రాయలున్నవి.
ప్రస్తుతం బెంగాల్ లోని ప్రద్యమ్నంలోని అమ్మవారి ఆలయాన్ని శక్తిపీఠంగా కొలుస్తున్నారు. కలకత్తా సమీపాన గల సాగరసంగమంలో గంగానది ప్రవేశించే గంగాసాగర్ లో ఉన్న అధినాధ క్షేత్రమే శృంఖలాదేవి శక్తిపీఠమని కొందరి అభిప్రాయం.

Shrinkhala Devi Pradyumna is one of the eighteen Shaktipeeth. The word Shrinkhala has two meanings. The first one being, a Binding thread or Binding chain, second one is, a cloth which is used by the postnatal women to tie their abdomen tightly. According to the first meaning the goddess is in bounded form. Of-course, Jaganmata is bound only to the lord Shiva (Satya). She removes all bonds attached to her devotees. In the second meaning the goddess is in postnatal stage ( Mother of a newborn baby), in this form, she will see the entire universe as her child. The devotees imagine him/ her as a new born baby of Shrinkhala mata. A complete surrenderance (Saranagati) and Sishu bhava is required to worship her.
How to to : Shrinkhala Shaktipeeth present at Pandua, in Hugly district of West Bengal. We can go to this place by train from Kolkata. But at present there is no temple in that place. We will see a Minar in spite of the temple. But still in Maghamasa of every year, a mela tala will be conducted there.
2) Some people consider it as Shrinkhala Shaktipith present at Ganga sagar, in Adinath kshetra.
3) Some people consider that Srunkhala mata is present near Shringeri of Karnataka, brought by Rishyashringa maharshi, on the order of Goddess.
4) Some people consider that the temple is in Chotilla, Gujarat.
But the majority people accept the first argument. That is, Shrinkhala mata is at Pandua, near Hugly district, West Bengal state.