బీట్రూట్ - ఒకటి, ఖర్జూరాలు - మూడు, పుదీనా ఆకులు - మూడు, నీళ్లు - ఒకటిన్నర కప్పు, మిరియాలపొడి - అరచెంచా, నిమ్మరసం - చెంచా, ఉప్పు - అరచెంచా.
బీట్రూట్ కడిగి చెక్కు తీసి ముక్కల్లా కోసి మిక్సీజారులోకి తీసుకోవాలి. అందులోనే ఖర్జూరాలూ, పుదీనా ఆకులూ, నీళ్లూ పోసుకుని రసంలా చేసుకుని వడకట్టాలి. ఇప్పుడు మిరియాలపొడీ, నిమ్మరసం, ఉప్పూ కలిపి ఫ్రిజ్‌లో పెట్టి.. చల్లగా అయ్యాక తాగాలి.
బీట్ రూట్ జ్యూస్ కొద్దిగా జిడ్డుగా, చల్లగా, పోషకాలతో పిత్తాన్ని నియంత్రణలో ఉంచుతుంది. రక్తాన్ని మెరుగు పరుస్తుంది. శరీరానికి బలం చేకూరుస్తుంది. బీట్ రూట్ లోని బెటైన్ పొట్టను, పెద్దప్రేగును శుద్ధి చేస్తుంది. బీట్ రూట్ ను రసంగా చేసుకొని త్రాగితేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఏదైనా జబ్బుపడిన తిరిగి కోలుకొనేవారికి మంచి ఉపయోగం. రక్తన్ని శుద్ధిచేస్తుంది. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా త్రాగకూడదు. అరిగించుకోవటం కొద్దిగా కష్టం. చిన్నపిల్లలకు, అరుగుదల తక్కువగా ఉన్నవారి పలచగా చేసుకొని త్రాగటం మంచిది.