కాకరకాయలు – 5
నీళ్లు – గ్లాసు
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
నిమ్మరసం – టీ స్పూన్
కాకరకాయ పైన తొక్కను చెక్కేయాలి. మరీ ఎక్కువ కాకుండా పైన బొడిపెల్లా ఉన్నంత వరకు తీసేస్తే చాలు. సన్నని ముక్కలుగా కట్ చేయాలి. గ్లాసు నీళ్లలో కట్ చేసిన కాకర కాయముక్కలు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి కనీసం 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత వీటిని మిక్సర్‌జార్‌లో వేసి బ్లెండ్ చేసి, రసం పిండాలి. ఈ రసానికి నీళ్లు కలిపి, దీంట్లో నిమ్మరసం కలిపి సేవించాలి. అధికబరువు, మధుమేహం, ఆస్త్మా వంటి సమస్యలకు కాకరలోని ఔషధాలు అమోఘంగా పనిచేస్తాయి.