కావల్సినవి: సొరకాయ – 250 గ్రాములు
పుదీనా ఆకులు– 4–6;
నీళ్లు – కప్పు;
జీలకర్ర పొడి – టీ స్పూన్;
మిరియాల పొడి – అర టీ స్పూన్;
ఉప్పు – తగినంత
అల్లం– చిన్నముక్క
తయారీ: సొరకాయను శుభ్రం చేసి, పైన తొక్క తీయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అల్లం ముక్క వేసి బ్లెండ్ చేయాలి. దీంట్లో పుదీన, కొత్తిమీర ఆకులు వేయాలి. నిమ్మరసం వేయాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. దీంట్లో అర కప్పుడు నీళ్లు పోసి మరోసారి గుజ్జు మెత్తగా అయ్యేదాకా బ్లెండ్ చేయాలి. దీంట్లో మరికొన్ని నీళ్లు కలిపి, వడకట్టాలి. గ్లాసులో
పోసి సేవించాలి.