Carrot Juice / క్యారెట్ జ్యూస్
క్యారెట్ జ్యూస్ మంచి పోషకాలు, పీచుతో కూడి ఉంటుంది.ఒక కప్పు రసం మూడు క్యారెట్ లతో సమానం. ఒక కప్పుతో 94 కేలరీల శక్తి లభిస్తుంది. పచ్చి క్యారెట్ ల కంటే రసంలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. కె, ఎ విటమిన్లు ఉంటాయి.ప్రకృతి సిద్ధమైన చక్కెర ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది. కానీ బరువు తగ్గాలనుకునే వారు మాత్రం పచ్చి క్యారెట్లను తినటం మంచిది. ఆకలి తీరుతుంది. తక్కువ కేలరీలు ఉంటాయి.
కావల్సినవి
క్యారెట్ : మీడియం సైజ్ ది ఒకటి
యాలకులు : రెండు
పొదీనా : కొద్దిగా
క్యారెట్ ను శుభ్రం చేసుకుని, చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి తరువాత యాలకులు, పొదీనా వేసి మరోసారి మిక్సీ తిప్పి తీసుకొని వడపోసి త్రాగవచ్చు. రుచి కోసం కొద్దిగా పంచదార, చల్లదనం కోసం కొద్దిగా ఐస్ కలుపుకోవచ్చు.