Papaya Juice / బొప్పాయి జ్యూస్
పండిన బొప్పాయి కొద్దిగా జిడ్డుగా, బరువుగా ఉండి తేలికగా అరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. గుండెకు, శరీరానికి బలాన్నిస్తుంది..
దాదాపు సగం వరకు బొప్పాయిలో చక్కెర గ్లూకోజ్ కలిగి ఉంటుంది. మిగిలిన సగం ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుంది. విటమిన్ ఏ ఎక్కువగా బొప్పాయిలో ఉంటుంది. రక్తహీనతను కూడా పోగొడుతుంది.
కావలిసినవి
బొప్పాయి : పెద్ద ముక్క ఒకటి
తయారు చేసే విధానం
బొప్పాయి ముక్కను చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రుచి కోసం యాలకులు, యాపిల్ ముక్కలు కలుపుకోవచ్చు. గ్రైండ్ చేసిన దాంట్లో కొద్దిగా నీరు, రుచి కోసం కొద్దిగా పంచదార, ఐస్ కలుపుకొని త్రాగవచ్చు.