header

Pudina Juice

pudina juice

పుదీనా జ్యూస్
కావల్సినవి:
పుదీనా ఆకులు - పది, కొత్తిమీర తరుగు - నాలుగు చెంచాలు, అల్లం - చెంచా, నీళ్లు - రెండు కప్పులు, ఇంగువ - చిటికెడు, నల్ల ఉప్పు - చిటికెడు, మిరియాలు - అరచెంచా, వేయించిన జీలకర్ర - అరచెంచా, నిమ్మరసం - మూడు టేబుల్‌స్పూన్లు, తేనె - చెంచా, ఉప్పు - అరచెంచా.
తయారు చేసే విధానం :
కడిగిన పుదీనా, కొత్తిమీరా, అల్లం, కాసిని నీళ్లూ, ఇంగువా, వేయించిన జీలకర్రపొడీ, మిరియాలూ, నల్ల ఉప్పూ మిక్సీజారులోకి తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని మరో గిన్నెలోకి తీసుకుని నీళ్లు కలపాలి. ఇప్పుడు నిమ్మరసం, ఉప్పూ, తేనె కలిపి రెండు గంటలు ఫ్రిజ్‌లో పెట్టి తాగాలి.