పుచ్చకాయ - సగం ముక్క, నిమ్మకాయ - ఒకటి, మిరియాలపొడి - అరచెంచా, ఉప్పు - పావుచెంచా.
పుచ్చకాయని ముక్కల్లా కోసి, గింజలు తీసేసి మిక్సీజారులోకి తీసుకోవాలి. కాసిని నీళ్లు పోసి రసం చేసుకోవాలి. దీన్ని ఓ గిన్నెలోకి తీసుకుని నిమ్మరసం, మిరియాలపొడీ, ఉప్పు కలపాలి. చల్లగా కావాలనుకుంటే రెండు మూడు ఐసుముక్కలు వేసుకోవచ్చు.