header

Matsyavataram

మత్స్యావతారం :
matsyavataram శ్రీమహావిష్ణువు దశావతారాలలో మొదటిది మత్స్యావతారం. కృత(సత్య) యుగంలో జరిగింది. సృష్టి కార్యంలో అలసిన బ్రహ్మ కల్పాంత సాయం సంధ్యలో కాస్త కునుకు తీస్తాడు. ఈ సమయంలో హయగ్రీవుడని రాక్షసుడు బ్రహ్మ దగ్గరనుండి వేదాలను తస్కరించి సముద్రంలో దాక్కుంటాడు. శ్రీమహావిష్ణువు మత్స్యరూపంలో సముద్రంలోకి వెళ్ళి హయగ్రీవుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు ఇస్తాడు.