దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము. శ్రీవరాహమూర్తి, వరాహావతారము, వరాహ స్వామి ఇవన్నీ శ్రీమహావిష్ణువు మూడవ అవతారమును వర్ణించే నామములు. ఇంకా ఆది వరాహ మూర్తి, యజ్ఞవరాహ మూర్తి, మహాసూకరం అని నామాలు కూడా ఉన్నాయి.
మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీవరాహమూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. వరాహావతారంలో స్వామి హిరణాక్షుడిని సంహరించి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడతాడు.
తిరుమల కొండలపై మొదట వెలసిన స్వామి వీరే, వీరి అనుమతితోనే శ్రీవేంకటేశ్వరుడు అక్కడ నివాసము ఏర్పాటుచేసుకున్నారు.
ఈ సంఘటన కృతయుగంలో (సత్యయుగం) జరిగినది.