
సీతారామలక్ష్మణులు మహర్షుల ఆశ్రమాలను దర్శించి, పిదప గోదావరి తీరాన పంచవటి వద్ద పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసింపసాగారు. అక్కడకి రావణాసురుని చెల్లెలైన శూర్పణఖ అనే కామరూపియైన రాక్షసి అందమైన అతివ రూపంలో వచ్చి రాముని మోహించి తనను వరించమని కోరుతుంది. రాముడు ఆమెను లక్ష్మణుని వద్దకు పంపుతాడు. లక్ష్మణుడు ఆమెని తిరస్కరిస్తాడు. శూర్పణఖ కోపంతో సీతను తినివేయడానికి సన్నద్ధమైనది. లక్ష్మణుడు కోపోద్రేకుడై ఆమె ముక్కు చెవులు కోసి వేస్తాడు. శూర్పణఖ వెళ్ళి తన అన్నయైన రావణునితో మొరపెట్టుకొంది. రావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామ లక్ష్మణులను దూరంగా వెళ్ళేలాపన్నాగం పన్ని, తాను భిక్షకుని రూపంలో సీతను అపహరించుకుపోతాడు..
ఆశ్రమానికి తిరిగి వచ్చిన సీతారాములు సీత కనిపించక హతాశులైన రామలక్ష్మణులు ఆమెను వెతుకనారంభిస్తారు. దారిలో వారికి కొనవూపిరితోనున్న జటాయువు కనబడతాడు. వారికి సీతాపహరణం గురించి తెలిపి రావణుని ఎదుర్కొని తాను ప్రాణాలమీదకు తెచ్చకున్నానని తెలిపి రాముని చేతిలో మరణిస్తాడు. రాముడు భక్తిశ్రద్ధలతో జటాయువుకి అంత్య్రక్రియలు చేస్తాడు.
రామలక్ష్మణులు మాతంగముని ఆశ్రమంలో వారికోసం ఎదురు చూస్తున్న శబరి ఆతిథ్యం స్వీకరిస్తారు. శబరి సూచనలపై ఋష్యమూకపర్వత ప్రాంతానికి బయలుదేరతారు.
కిష్కిందాకాండము....తరువాత పేజిలో......
.