
అప్పుడు కిష్కింధను వాలి అనే వానర రాజు పరిపాలిస్తుంటాడు. ఒక రాక్షసుని కారణంగా అన్నదమ్ములైన వాలి సుగ్రీవులకు వైరం కలుగుతుంది. మహాబలవంతుడైన వాలి, సుగ్రీవుని కిష్కింద నుండి తరిమివేస్తాడు. వాలి భయంతో సుగ్రీవుడు ఋష్యమూకపర్వతంపై తన మంత్రులతో సహా నివసిస్తుంటాడు. హనుమంతుని కారణంగా రాముడూ, సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు.
రాముడు వాలిని వధించి సుగ్రీవునకు కిష్కందను అప్పగిస్తాడు.
సుగ్రీవుడు కూడా సీతాన్యేషణలో రామునికి సహాయం చేస్తానని మాట ఇస్తాడు. అప్పుడు వర్షాకాలం కావటంతో సీతాన్వేషణ ఆపుతారు. వర్షాకాలం పూర్తవటంతో సీతాన్యేషణకు సన్నాహాలు మొదలు పెడతారు. సీతాన్యేషణకై సుగ్రీవుడు వానరబృందాలను నలు దిక్కులకు పంపుతాడు. అలా అంగదుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు, నీలుడు, మైందుడు, ద్వివిదుడు సుషేణుడు వంటి మహావీరులు దక్షిణ దిక్కుకు బయలు దేరతారు. వారు కొండకోనలను, గుట్టలను వెదకుచూ దక్షిణ సముద్రతీరానికి చేరతారు.
అక్కడ వారికి జటాయువు అన్న అయిన సంపాతి అనే పక్షిరాజు వలన రావణాసురుడు అనే రాక్షసుడు సీతాదేవిని దక్షిణదిశగా తీసుకువెళ్ళి లంకలో ఉంచాడని తెలుసుకుంటారు.
సుందరాకాండము.........తరువాత పేజిలో............
.