ఇక్ష్వాకు వంశపు రాజైన దశరథుడు ఆయోధ్యా నగరాన్ని రాజధానిగా, కోసలదేశాన్ని పాలిస్తుంటాడు.ధశరథునికి ముగ్గురు భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. సంతానం లేని కారణంగా దశరధుడు తమ కులగురువైన వశిష్టుని సలహాతో పుత్రకామేష్టి యాగం చేస్తాడు. యాగఫలితంగా దశరథునికి నలుగురు పుత్రులు జన్మిస్తారు. కౌసల్యకు శ్రీరాముడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుజ్ఞులు, కైకేయికి భరతుడు జన్మిస్తారు
కులగురువు వశిష్టుని వద్ద రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సకల విద్యలనూ అభ్యసిస్తారు.
ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరధుని వద్దకు వచ్చి తానొక యాగాన్ని తలపెట్టానని దానికి రాక్షసులు విఘ్నాలు కల్పిస్తున్నారని కనుక రామ లక్ష్మణులను యాగసంరక్షణ కోసం తనతో పంపమని కోరాడు. కులగురువు వశిష్టుని సలహాతో దశరథుడు రామలక్ష్మణులను పంపుతాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు ఎన్నో అస్త్రవిద్యారహస్యాలను బోధిస్తాడు. దారిల
ో రాముడు తాటకి అనే రాక్షసిని సంహరిస్తాడు.వారు గంగానదిని దర్శిస్తారు. గౌతమముని భార్య శాపవశాత్తు జడపదార్థంగా మారుతుంది. రాముని పాదస్పర్శచేత అహల్యకు శాపవిమోచనం కలుగుతుంది. రామ లక్ష్మణుల రక్షణలో యాగము జయప్రథముగా జరుగుతుంది. మారీచుడు, సుబాహుడు, ఇతర రాక్షసులు దండింపబడ్డారు.
విశ్వామిత్రుడుకి మిధిలా నగర రాజైన జనకుని కుమార్తె సీతా స్వయంవరానికి ఆహ్వానం అందుతుంది. వారు జనకుని రాజధానియైన మిథిలానగరం చేరాతారు.
అక్కడ సీతా స్వయంవరంలో నిబంధన ప్రకారం రాముడు శివుని విల్లు ఎక్కుపెట్టగా ఆ విల్లు విరిగిపోతుంది, సీతా దేవికి రామునితోను, లక్ష్మణునికి సీత చెల్లెలయిన ఊర్మిళ తోను, భరతునికి మాండవితోను, శతృఘ్నునకు శృతకీర్తితోనూ వైభవంగా వివాహం జరుగుతుంది.
అయోధ్యకు వెళ్ళేదారిలో వీరికి పరశురాముడు అడ్డుతగిలి శివుని విల్లు విరచినందుకు కోపించి, విష్ణుచాపమైన తన విల్లును ఎక్కుపెట్టమని అడుగుతాడు. శ్రీరాముడు విష్ణుచాపాన్ని సునాయాసంగా ఎక్కుపెడతాడు. పరశురాముడు శ్రీరాముని మహావిష్ణువు అవతారంగా తెలుసుకుంటాడు. తాము ఇద్దరూ విష్ణుస్వరూపులే అని కూడా గ్రహిస్తారు. వివాహానంతరం వారు అయోధ్యకు తిరిగి వస్తారు.
తరువాత పేజిలో..... అయోధ్యాకాండము.....
.