header

Sri Anjaneya, Hanuman

హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తుడిగా, అభయాంజనేయుడిగా, అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమంతుడు, భజరంగబలి, మారుతి, అంజనిసుతుడు, వాయునందనుడు వంటి ఎన్నో పేర్లతో ఆంజనేయుని ఆరాధిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఆంజనేయుని గుడి లేని ఊరు ఉండదు.
హనుమంతుని జననం
పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించింది. కేసరి అనే వానరవీరుడు ఈమె భర్త. కేసరి చాలా బలవంతుడు. కేసరి మాల్యవంతమనే పెద్ద పర్వతం మీద నివసిస్తూ ఉండేవాడు అంజనీ, కేసరులు సంతానము కొరకు భక్తితో శివుని పూజిస్తారు. శివానుగ్రహాన్ని వాయుదేవుడు పండు రూపంలో అంజనకు అందిస్తాడు. వీరికి జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను. పుట్టుకతోనే దివ్యతేజస్సు కలిగిన ఆ బాలుడిని అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు.
ఆంజనేయుని అల్లరిని భరించలేక మునులు ఆంజనేయుని శపించటం వలన అతని శక్తి అతనికి తెలియకుండా ఉంటుంది. ఎవరైనా గుర్తు చేస్తు అతని శక్తి అతని తెలుస్తుందని చెబుతారు.
ఒకసారి అంజినీ దేవి నిద్రపోతున్న ఆంజనేయుడిని వదిలి పెట్టి పళ్ళు తీసుకొని రావడానికై అడవికి వెడుతుంది. ఆకలి వేసి మెలుకువ వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఆకాశంలో సూర్య బింబం ఎర్రగా కనిపిస్తుంది. సూర్యుని పండుగా భావించి తినడానికి ఒక్కసారి ఆకాశం పైకి ఎగురుతాడు. రివ్వుమని వాయు వేగంతో సూర్యుడి వైపు దూసుకుపోతున్న ఆ బాలుడిని దేవతలు , మునులు ఆశ్చర్యంగా చూడసాగారు. మహాశక్తిమంతుడైన ఆంజనేయునికి సూర్యుడి వలన వేడి తగలకుండా వాయువు అతనిచుట్టూ చల్లగాలిని వీస్తుంది. సూర్యుడు కూడా ఒక్క సారిగా తనవైపుకు దూసుకొస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడయిన తరువాత అనేక ఘనకార్యాలు చేసే మహత్తరవీరుడిగా గుర్తించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకొన్నాడు. ఆరోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుణ్ణి పట్టుకోవడానికి రాహువు వేగంగా సమీపిస్తునాడు. అతనికి అపరిమితమైన వేగంతో బాణంలా దూసుకువస్తున్న హనుమంతుడు కనిపించాడు. ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు వెలవెల పోయాడు. ఆంజనేయుడు రాహువుకు మరో రాహువులా కనపడ్డాడు. వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్ళి తాను చూసింది చెప్పాడు. ఇంద్రుడు వెంతనే ఐరావతం ఎక్కి వజ్రాయుధం తీసుకొని రాహువుతో వచ్చి నిరుపమాన వేగంతో పోతూన్న ఆంజనేయుడిని చూసాడు. వేగంగా వెడుతున్న ఆంజనేయుడికి ఐరావతం తెల్లగా ఒక పండులా కనిపించింది.
దాన్ని చప్పున అందుకోబోయాడు. ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధాన్ని ఆంజనేయుడి పైకి విసురుతాడు . ఆ వజ్రాయుధం హనుమంతుడి దవడకు తగులుతుంది. దానితో హనుమంతుడు ఒక పర్వతం మీద పడిపోతాడు. వాయుదేవునకు ఆగ్రహం కలుగుతుంది. సమస్త లోకాలలో గాలి వీచకుండా చేస్తాడు. సకల ప్రాణులు ప్రాణవాయువు అందక అల్లాడిపోతాయి. దేవతలందరూ వెళ్ళి జరుగుతున్న విపత్తు గురించి బ్రహ్మ దేవుడికి చెబుతారు. బ్రహ్మదేవుడు వెంటనే అంజనీ దేవి వద్దకు దేవతలను వెంట పెట్టుకొని వెళతాడు. అంజనీ దేవి బాల హనుమంతుడుని ఒడిలో పెట్టుకొని పెద్దగా దుఃఖిస్తూ ఉంది.
బ్రహ్మను చూసి వాయుదేవుడు బ్రహ్మ పాదాలకు నమస్కరిస్తాడు. బ్రహ్మ అతడిని దీవించి తన హస్తాలతో బాల హనుమను ఒక్క సారి నిమరగానే అతని శరీరం పై గాయాలు మాయమై దేహం తేజస్సుతో వెలుగుతుంది. బ్రహ్మ స్పర్శలోని మహత్తు వల్ల అతడు నిద్ర లోంచి లేచినవాడి వలె లేచాడు. వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలి వీచేటట్లు చేసి సకల ప్రాణులను రక్షిస్తాడు
తరువాత పేజిలో............... .