header

Sri Anjaneya, Hanuman

హనుమంతుడు సుగ్రీవునికి ఋష్యశృంగ పర్వతం గురించి తెలుపుతాడు. ఒకసారి దుంధుబి అనే రాక్షసుడు గర్వంతో వాలిని యుద్ధానికి పిలుస్తాడు. దుంధుబి, వాలికి ఘోర యుద్ధం జరుగుతుంది. వాలి దుంధుబిని సంహరించి దుంధుభి కళేబరాన్ని పైకి విసరివేయగా ఆ కళేబరం ఋష్యశృంగ పర్వతం మీద తపస్సు చేస్తున్న మతంగ మహర్షి మీద పడింది. కోపంతో మతంగ ముని ఈ పర్వతం మీదకు వాలి వస్తే తల పగిలి మరణిస్తాడని వాలిని శపిస్తాడు. కనుక వాలి ఈ ప్రాంతానికి రాడు. మనం ఈ పర్వతం మీద ఉండడం ఎంతో క్షేమం అని హనుమంతుడు సుగ్రీవునికి సలహా ఇస్తాడు. సుగ్రీవుడు హనుమంతుడిని మెచ్చుకొని మంత్రులతో సహా అక్కడ నివసించసాగాడు.
రామలక్ష్మణులతో మైత్రి
ధశరధుని కుమారుడైన రాముడు తన భార్య సీతాదేవి, తమ్ముడు లక్ష్మణుతో సహా అరణ్యవాసం చేస్తుంటాడు. ఈ సమయంలో రావణాసురుడు సీతాదేవిని అపహరిస్తాడు. సీత జాడకై వెతుకుతూ రామలక్ష్మణులు రుష్యమూక పర్వత ప్రాంతానికి వస్తారు. ధనుర్భాణాలు ధరించి సంచరిస్తున్న వారిని చూసి వాలి తనను చంపటంకోసం వీరిని పంపించాడని భావిస్తాడు. కాని హనుమంతుడు సుగ్రీవుని ధైర్యం చెప్పి బ్రహ్మచారిగా రూపం మార్చుకొని రామలక్ష్మణుల వద్దకు వస్తాడు. అయ్యా! మీరు మహాపురుషులని చూస్తేనే తెలుస్తూంది ధనుర్ధారులై ఇక్కడ సంచరించడానికి కారణం ఏమిటి? నేను సుగ్రీవుడి మంత్రిని. వానరుడిని. కామరూప విద్య తెలిసినవాడిని, ఈ రూపంలోకి మారాను." అని తెలుపుతాడు. అందుకు రాముడు" లక్ష్మణునితో లక్ష్మణా! మనమే సుగ్రీవునితో మైత్రికోసం అతనిని కలవాలని చూస్తున్నాము. అతని దూత మన వద్దకు వచ్చాడు. ఇతడి సంభాషణలో ఒక్క అపశ్రుతీ లేదు. మహా వ్యాకరణ పండితుడని తెలుస్తున్నది. ఎవరినైనా ఇట్టే మాటలతో ఆకట్టుకోగల సమర్ధుడు. " అని మెచ్చుకొని తన వృత్తాంతం అంతా చెప్పాడు. అలాగే హనుమంతుడు కూడా సుగ్రీవుని గురించి చెప్పి రామలక్ష్మణులను వెంటబెట్టుకొని సుగ్రీవునికి పరిచయం చేస్తాడు. అగ్ని సాక్షిగా సుగ్రీవుడు రాముడు స్నేహితులయ్యారు.
వాలిని వధించి సుగ్రీవుడిని కిష్కింధకు రాజుగా చేస్తానని రాముడు మాట ఇస్తాడు. మాట ప్రకారం వాలిని వధించి సుగ్రీవుని రాజుగా అభిషేకిస్తాడు. సుగ్రీవుడు కూడా సీతాన్వేషణలో రామునికి సాయం చేస్తానని మాట ఇస్తాడు. కానీ వర్షాకాలం వల్ల రామలక్ష్మణులు అక్కడ ఒక కొండగుహలో నివసించ సాగారు. వర్షాకాలం ముగుస్తుంది. కానీ సుగ్రీవుడు భోగలాలసతో రాముడికిచ్చిన మాటను మరచిపోగా లక్ష్మణుడు కిష్కింధకు వచ్చి హెచ్చరిస్తాడు. అప్పుడు సుగ్రీవుడు ఎక్కడెక్కడి వానరవీరులను కిష్కిందకు రప్పించి నాలుగు బృందాలుగా విభజించి ఒకొక్క బృందానికి నాయకుని ఏర్పాటు చేసి నాలుగు దిక్కలకు పంపుతాడు. జాంబవంతుడు, అంగదుడు, నలుడు, హనుమంతుడు మొదలగు వారిని దక్షిణ దిక్కుగా పంపుతాడు రాముడు హనుమంతుడు తప్పక సీత జాడను తెలుసుకుంటాడని నమ్మి తన అంగుళీయాన్ని గుర్తుగా ఇస్తాడు. వీరు చెట్టులు, పుట్టలు అరణ్యాలను గాలిస్తూ దక్షిణ సముద్ర ప్రాంతానికి వస్తారు. కానీ వారికి సీత జాడమాత్రం తెలియలేదు. ఆకలిదప్పులతో దీన స్థితికి చేరుకుంటారు.
తరువాత పేజిలో...............