తరువాత సింహిక అనే రాక్షసి హనుమతుడు ఎగురుతుండగా నీటిపై ఉన్న అతని నీడను పట్టి ఆపింది. హనుమంతుడు తన శరీరాన్ని వేగంగా పెంచి ఒక్క సారి తగ్గించుకొని రాక్షసి కడుపులోకి వెళ్ళి పేగులు చీల్చి బయటకు వస్తాడు. సింహిక మరణిస్తుంది. సాయంసమయానికి హనుంతుండు లంకలోని త్రికూట పర్వతం మీద వాలతాడు. చీకటి పడిన తరువాత తన శరీరాన్ని పిల్లి అంత చిన్నదిగా మార్చుకుని లంకలోని ప్రవేశించే ప్రయత్నం చేస్తాడు. కాని లంకకు కాపాలాగా ఉన్న లంకిణి అనే రాక్షసి అడ్డుపడుతుంది లంకిణి హనుమంతుని చరుస్తుంది. హనుమంతుడు కోపంతో ఎడమ పిడికిలితో ఆమెను కొడతాడు.
ఆమె కిందపడి " మహావీరా! ఒక వానరం నన్ను జయించిన రోజున లంకావైభవం నశిస్తుందని బ్రహ్మ నాకు చెప్పాడు. దానవులకు ఆయువు మూడింది. నీవు స్వేఛ్చగా లంకలోకి వెళ్ళవచ్చ" అన్నది. హనుమంతుడు మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీత దేవి కోసం వెతకటం మొదలుపెడతాడు
హనుమంతుడు రావణుని అంతఃపురంలోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకుతాడు. నిద్రించుచున్న స్త్రీలలో అమిత తేజస్సుతో ప్రకాశిస్తున్న మండోదరిని చూచి సీత అని క్షణకాలం భ్రమిస్తాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగిస్తాడు.వెదకి వెదకి సీతమ్మ జాడ కానక చింతిస్తాడు ఏమిచేయాలో తోచలేదు. వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి ఇష్టపడడు. తిరిగి సకలదేవతలకు నమస్కరించి సీత జాడకోసం వెతకడం మొదలు పెడతాడు. చివరకు అశోకవనంలో శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూస్తాడు.
అక్కడికి రావణుసురుడు వచ్చి ఆమెను బెదరించి, తనకు వశముకావలెనని కోరతాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. రాక్షస స్త్రీలు సీతను భయపెడుతూ ఉంటారు.
తరువాత పేజిలో...............