header

Sri Krishna

శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు రోహిణీ నక్షత్రంలో దేవకీ గర్భాన శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. కృష్ణుడు జన్మించాక వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్ళలో పెట్టుకొని, చెరసాల బయట నిద్ర పోతూ ఉన్న కావలి వాళ్ళను తప్పించుకొని, యమునా నది వైపు బయలు దేరుతాడు. యమునానది రెండుగా చీలి పోతుంది. వ్రేపల్లెలోని తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుడిని విడిచి యశోదకు పుట్టిన శిశువును తీసుకొని తిరిగి చెరసాలకు వస్తాడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. కంసుడు ఆ శిశువును తీసుకొని చంపడానికి పైకి విసరగా ఆ శిశువు యోగమాయగా మారి ఎనిమిది చేతులతో శంఖ చక్ర గదా శారంగాలతో ఆకాశంలోకి పోయి తాను యోగ మాయనని కంసుడిని అంతమొందించేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయం అవుతుంది. దేవకీవసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు వ్రేపల్లెలోని యశోదాదేవి ఒడిని చేరి, అక్కడే పెరుగుతాడు.
శ్రీకృష్ణుని బాల్యం కృష్ణయ్య జననం వ్రేపల్లె అంతా పాకిపోయింది. యశోదమ్మ ఆనందానికి హద్దులు లేవు. వ్రేపల్లె వాసులంతా సంతోషంతో యశోదా నందుల ఇంట సందడి చేసారు.

కంసుడు పూతన అనే రాక్షసిని బాలకృష్ణని సంహరించటానికి పంపుతాడు. పూతన అందమైన అతివ రూపం దాల్చి కృష్ణునికి విషం పూసిన తన రొమ్ముల ద్వారా పాలిచ్చి చంపాలనుకుంటుంది. కానీ కృష్ణపరమాత్ముడు విషంతో సహా పూతన ప్రాణవాయువును కూడా పీల్చివేస్తాడు. పూతన హాహాకారాలతో మరణిస్తుంది.
తరువాత పేజిలో................ .