header

Sri Krishna

శకటాసురుడు కంసుడు ఒకసారి శకటాసురుడనే రాక్షసుని శ్రీకృష్ణుని చంపటానికి పంపుతాడు శకటాసురుడు అక్కడున్న ఒక బండిలో ప్రవేశించి కృష్ణుని మీదికొస్తాడు. కృష్ణుడు తన కాలితో ఆ శకటాసురిణ్ణి తన్ని సంహరిస్తాడు.
అఘూసురుడు

ఇంకొక సారి గోవులను అడవిలో మేపుతుండగా అఘూసురుడు రాక్షసుడు కృష్ణుణ్ణి సంహరించేందుకు భయంకరమైన సర్పరూపం ధరించి కొండగుహలాగా నోరు తెరచి ఉంచుతాడు. గోప బాలకులు అది కొండగుహగా భావించి అందులో ప్రవేశిస్తారు. కృష్ణుడు అఘూసురుణ్ణి గుర్తించి తానుకూడా అఘూసురుడి నోటిలో ప్రవేశించి తన శరీరాన్ని పెంచి అఘూసురుణ్ణి చీల్చుకొని బయటకు వస్తాడు.

కాళీయుడు
వ్రేపల్లెకు దగ్గరలోని కాళింది మడుగులో కాళీయుడనే విషసర్పం తన భార్యలతో సహా నివసిస్తుంటాడు. కాళీయుని విషం కారణంగా మడుగులోని నీరంతా విషమయమవుతుంది. ఆ నీరు త్రాగి గోవులు మరణిస్తుంటాయి. కృష్ణుడు కాళీయుని పడగమీదకు ఎగసి కాళీయమర్ధనం చేస్తాడు. కాళీయుడు కృష్ణుని శరణుకోరి ఆ మడుగు వదలి వెళ్ళిపోతాడు.



ఒకసారి యశోదమ్మ కృష్ణుని అల్లరి భరించలేక త్రాటితో చిన్నికృష్ణుని రోటికి కట్టివేస్తుంది. కృష్ణుడు రోటిని లాక్కుంటూ వెళ్ళి మద్ది చెట్లను కూల్చివేసి మద్దిచెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాపవిముక్తిని ప్రసాదిస్తాడు.







తృణావర్తుడు మరోసారి కంసుడు తృణావర్తుడనే రాక్షసుడుని పంపుతాడు. వాడు పెద్దసుడిగాలి రూపంలో వచ్చి కృష్ణుణ్ణి గాలిలోకి ఎగరవేసుకొని పోతాడు. కానీ చిన్ని కృష్ణుడు తృణావర్తుణ్ణి కూడా గాలిలోనే సంహరిస్తాడు.





కేశి
కంసుడు మరొక సారి వేగంగా పరుగెత్తగలిగే కేశి అనే రాక్షసిని శ్రీకృష్ణుని చంపిరమ్మని పంపుతాడు. కేసి గుర్రం రూపం దాల్చి వేగంగా కృష్ణుని మీదకు వస్తుంది. కృష్ణుడు లాఘవంగా కేశిని పట్టుకొని హతమారుస్తాడు.
తరువాత పేజిలో................ .