header

Sri Krishna

గోవర్ధన గిరి govardhani giri బాలకృష్ణుని ఏడు సంవత్సరాల వయస్సులో ఓ సారి వ్రేపల్లె వాసులంతా తమ ఆనవాయితీ ప్రకారం ఇంద్రుడి పూజకు బయలు దేరతారు. కాని కృష్ణుడు వారించి తమ గోవులకు ఆహారం, తమకు పండ్లు, ఫలాలు ఇచ్చే గోవర్ధనగిరికి పూజలు జరుపుదామని వ్రేపల్లె వాసులను ఒప్పిస్తాడు. అలాగే అందరూ గోవర్ధనగిరిగి పూజలు చేస్తారు. దేవతల రాజైన ఇంద్రునికి కోపం వచ్చి ఏడు రోజుల పాటు కుంభవృష్టి కురిపిస్తాడు. కృష్ణుడు తన చిటికిన వేలితో గోవర్ధనగిరిని పైకి లేపి దాని క్రింద గోవులకు, రెపల్లెవాసులకు ఆశ్రయం కల్పిస్తాడు. ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని శ్రీకృష్ణుని మన్నించమని కోరతాడు

ఓసారి బ్రహ్మదేవునికి కృష్ణుని పరీక్షించాలని బుద్ది పుడుతుంది. కృష్ణుని తో ఉన్న గోవులను, గోపాలరును మాయం చేస్తాడు. వీరందంరిని బ్రహ్మలోకంలో ఉంచుతాడు. కొంత కాలం తరువాత వ్రేపల్లె వైపు దృష్టి సారిస్తాడు. ఆశ్ఛర్యకరంగా కృష్ణునితో పాటు గోవులు, గోపాలకులు యధావిధిగా ఉంటారు. కృష్ణుడు తానే అందరి రూపం ధరిస్తాడు. బ్రహ్మదేవుడు కృష్ణని గొప్పతనాన్ని తెలుసుకొని గోవులను, గోపాలకులను తిరిగి అప్పగిస్తాడు.

కంసవధ
కంసుడు ధనుర్ యాగాన్ని తలపెడతాడు. కృష్ణ బలరాములకు ఆహ్వనం పంపుతాడు. పద్నాలుగు సంవత్సరాల బాలుడైన శ్రీకృష్ణుడు తన అన్న బలరాముతో పాటు ధనుర్ యాగానికి మధురా నగరం బయలుదేరతాడు. రధం దిగి వీధులలలో నడుస్తుంటే మధురానగరం అంతా ఆనందిస్తుంది. ఓ పేద నేత కార్మికుడు అందించిన బట్టలు ప్రేమతో స్వీకరిస్తాడు. కుబ్జపూసిన మంచి గంధానికి మురిసిపోతాడు. కంసుని ఆస్థాన మల్లయోధులై చాణురు, ముష్టిక అనే యోధులను బలరామకృష్ణులు మట్టి కరిపిస్తారు. కృష్ణడు చివరకు కంసుని సింహానం మీద నుండి లాగి కిందపడవేసి సంహరిస్తాడు. ఊగ్రసేనునికి తిరిగి పట్టాభిషేకం చేస్తాడు. దీనితో కంసుని చరిత్రముగుస్తుంది.
తరువాత పేజిలో................ .