కాలయవనుడనే రాక్షసుడు ఒకసారి పెద్ద సైన్యంతో శ్రీకృష్ణుని పైకి యుద్ధానికి వస్తాడు. కాలయవనికి ముచికుందుడనే వాని వల్ల మృత్యువు ఉందని కృష్ణుడు తెలుసుకుంటాడు. కాలయవనుడు తన సైన్యంతో కృష్ణుని పైకి వస్తుంటే కృష్ణుడు భయపడినట్లు నటించి ముచికుందుడు నిద్రిస్తున్న గుహలోనికి ప్రవేశిస్తాడు. గాఢనిద్రలో ఉన్న ముచికుందుని శ్రీకృష్ణునిగా భావించిన కాలయవనుడు ముచికుందునికి నిద్రాభంగం కలిగిస్తాడు. ముచికుందుని నేత్రాగ్నికి కాలయవనుడు బూడిదైపోతాడు. కాలయవనుడు ముచికుందుని నేత్ర జ్వాలలకు భస్మమైన స్థలం నేటి గుజరాత్ లోని గిర్నార్ అంటారు. ముచికుందుడు దేవ దానవ యుద్ధంలో దేవతలకు సహాయపడినందుకు దేవతలనుంది తనను నిద్రలేపిన వారు భస్మం అయ్యేటట్లుగా వరం పొందుతాడు.
మగధను పరిపాలించే బృహద్రద రాజు యొక్క కుమారుడు. జరాసంధుడు ......మగధ రాజు. కంసుని మామ. ఒకరోజు బృహద్రధుడు వేటకు వెళ్ళి అరణ్యలో చందకౌశిక అనే మునిని దర్శిస్తాడు. ఆమునికి నమస్కారం చేసి తనకు సంతానం కలిగే భాగ్యాన్ని ప్రసాదించమంటాడు. చండకౌశికుడు అతని ఒక ఫలాన్ని ఇచ్చి రాజు గారి భార్యకు ఇవ్వమంటాడు.
బృహద్రధునికి ఇద్దరు భార్యలు. రాజధాని చేరి అంతఃపురంలో ఉన్న ఇద్దరు భార్యలకు ఆ ఫలాన్ని చెరోసగం చేసి పెడతాడు. కానీ విచిత్రంగా భార్యలిద్దరికూ ఒక బాలుడు సగం సగం శరీరంతో జన్మిస్తాడు. దిక్కుతోచని రాజు ఆ శరీరభాగాలను తన సేవకులచేత కోట ఆవల పారవేయిస్తాడు. జర అనే రాక్షసి ఆహారం కోసం నగరవీధులలో తిరుగుతుండగా బాలుని శరీర భాగాలు కనబడతాయి. జర ఆ రెండుభాగాలను ఒక్కటిగా కలుపుతుంది. వెంటనే ఆ బాలునికి ప్రాణం వస్తుంది. జర ఆ శిశువును బృహదద్రుని కి అప్పగిస్తుంది. జర అనే రాక్షసి చేత సంధింపబడిన వాడు కనుక జరాసంధుడు అనే పేరు వస్తుంది. ఒకనాడు చండకౌశికముని వచ్చి ఈ బాలుడు గొప్ప శివభక్తుడు అవుతాడని దీవిస్తాడు.
జరాసంధుడు అనేక మంది రాజులను బంధించి శివుడికి బలి ఇస్తున్నాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెబుతాడు. తాను, భీముడు, అర్జునుడు జరాసంధుని వద్దకు బ్రాహ్మణుల వేషముతో వెళ్ళి యుద్ధ భిక్ష కోరతాను అని ధర్మరాజుతో చెప్పి మగధకు బయలుదేరతారు. నగర పొలిమేరలు చేరుతుండగా జరాసంధుని కోటమీద ఉన్న దైవదత్తమైన ఢంకాల గురించి శ్రీకృష్ణుడు, భీమునితో చెబుతాడు. శత్రువులు ఎవరైనా కోటలో ప్రవేశిస్తే ఆ ఢంకాలు పెద్దగా మ్రోగుతాయి అని తెలియజేస్తాడు.
ఆ ఢంకాలను భీముడి ఉదరముతో నాశనం చేయమని చెబుతాడు. ఆ ఢంకాలను భీమునితో నాశనం చేయించి వారు రాజమార్గం నుండి కాక దొడ్డిదారి ద్వారా కోటలో ప్రవేశించి జరాసంధుని దర్శిస్తారు.
శ్రీకృష్ణుడు యుద్ధబిక్ష కోరతాడు. జరాసంధుడు భీమునితో యుద్ధం చేయటానికి అంగీకరిస్తాడు. తన కుమారుడైన భగదత్తునికి పట్టాభిషేకం చేసి భీమునితో యుద్ధానికి దిగుతాడు. 27 రోజులపాటు భీమునికి, జరాసంధునికి భయంకరంగా యుద్ధం సాగుతుంది. చివరకు శ్రీకృష్ణుని సూచనతో భీముడు జరాసంధుని రెండుగా చీల్చి రెండుదిక్కులకు విసరివేస్తాడు. దీనితో జరాసంధుని చరిత్ర ముగుస్తుంది.
నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురానికి రాజు. (నేటి అస్సాం) పదహారు వేలమంది రాజకన్యలను బంధించి చెరసాలలో ఉంచుతాడు. నరకుడు తల్లిచేతి మరణం పొందాలని బ్రహ్మదేవుని వలన వరం పొందుతాడు. నరకాసురుడు వరహావతారంలోని విష్ణుమూర్తికి, భూదేవికి జన్మిస్తాడు. లోకాలను బాధిస్తున్న నరకాసురుని బాధలు భరించిలేక దేవతలు, మునులు శ్రీకృష్ణుని శరణు కోరతారు. శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై నరకాసురుని మీదకు యుద్ధానికి వెళతాడు. సత్యభామ సహాయంతో నరకాసురుని వధించి అతని కుమారుడైన భగదత్తుని రాజుగా చేస్తాడు. నరకాసురుని చెరలో బంధించబడిన 16వేల రాజకన్యలను విడిపించి వారికి సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పిస్తాడు.
తరువాత పేజిలో................
.