సాయిబాబా రచించిన గ్రంధాలేమీ లేవు. సాయిబాబా బోధనలు మౌఖికంగానే ఉండేవి. అవి పెద్ద పెద్ద ఉపన్యాసాలు కావు. సమయానుసారంగా చేసిన చిన్న చిన్న ఉపదేశాలు. తన వద్దకు దర్శనానికి వచ్చిన వారిని తరచు సాయిబాబా ‘‘దక్షిణ’’ అడుగుతుండేవాడు. అలా వచ్చిన ధనాన్ని పేదలకు పంచిపెట్టేవారు. మిగిలిన కొద్దిపాటి ధనంతో పుగాకు, అగ్గిపెట్టెలవంటివి కొనేవారు.
భక్తులవద్ద దక్షిణ తీసికొన్న ధనం వారి పూర్వ ఋణాలను చెల్లించడానికి దోహదం చేస్తారని సాయి భక్తులు నమ్మేవారు.
దానము, ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడం – ఇవి బాబా బాగా ప్రోత్సహించిన గుణాలు. ఏదో సంబంధం లేకుండా ఎవరూ ఎక్కడికీ వెళ్ళలేరు అని బాబా అనేవారు. దగ్గరకు వచ్చిన వారిని తిరస్కరించకుండా ఆహ్వానించి ఆదరించమని చెప్పేవారు. “దప్పిక గొన్నవారికి నీరు, ఆకలిగొన్నవారికి అన్నము, నగ్నంగా ఉన్నవారికి దుస్తులు ఇవ్వు, నీ వరండాలో నలుగురూ కూర్చొని విశ్రమించే అవకాశం ఇవ్వు. అలాగైతే శ్రీహరి తప్పక ప్రసన్నుడౌతాడు. ఒక వేళ దానం చేయడం ఇష్టం లేకపోతే మర్యాదగా నిరాకరించు గాని వారి యెడల కుక్కలాగా మొరగవద్దు” అని చెప్పాడు
బాబా చెప్పిన వాటిలో మరి కొన్ని ప్రసిద్ధ వాక్యాలు
“నేనుండగా భయమెందులకు?”
అతనికి మొదలు లేదు... తుది లేదు "
తన భక్తులకు బాబా పదకొండు వాగ్దానాలు చేశాడు.
1. షిరిడీలో అడుగు పెట్టినవారి కష్టాలు తీరినట్లే.
2. మసీదు మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లివిరుస్తుంది.
3. నేనీ భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా సచేతనంగా ఉంటాను.
4. నా సమాధి నా భక్తులను దీవిస్తుంది. వారి అవసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది.
5. నాసమాధినుండే నేను మీకు దర్శనమిస్తాను.
6. నా సమాధినుండి నేను మాట్లాడుతాను.
7. నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ ఉంటాను. మీరు నావంక చూడండి.
నేను మీవంక చూస్తాను.
8. మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను.
9. నా సహాయం, బోధన కోరినవారికి అవి వెంటనే లభిస్తాయి.
నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు.
10. “ హిందువుల దైవమైన శ్రీ రాముడు, ముస్లిం ల దైవమైన అల్లా ఒక్కరే ! ఇరువురి బోధనల సారాంశం ఒక్కటే – అందరి దైవం ఒక్కరే ! కనుక మీలో మీరు కలహించుకోవడం మాని సోదరుల వలె కలిసి మెలిసి జీవించండి.”
11. సర్వాంతర్యామి అయిన ఆ భగవంతునిని సేవించుటకు మత భేదం ఆటంకం కాకూడదు
తరువాత పేజిలో ...............