ఇన్‌ఫెక్షన్లు తగ్గటం:
ఒకప్పుడు పుట్టిన తొలి ఏడాదిలోనే దొడ్డికి పెట్టటం, న్యుమోనియా, అంటువ్యాధులు.. ఇలా దాదాపు ఏడెనిమిది ఇన్‌ఫెక్షన్లు వస్తుండేవి. టీకాలు అందుబాటులోకి రావటం, పరిశుభ్రత పెరగటంతో ఇప్పుడివి బాగా తగ్గిపోయాయి. కానీ ఇది అలర్జీలు పెరగటానికీ దోహదం చేస్తోంది. ఇన్‌ఫెక్షన్లు వచ్చినపుడు రోగనిరోధక వ్యవస్థ ఉత్తేజితమై.. వాటిపై పోరాడటానికి తర్ఫీదు పొందుతుంది. శరీరానికి హాని కలిగించేవేంటో, కలిగించనివేంటో గుర్తించే సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. ఇన్‌ఫెక్షన్లు రాకపోతే ఈ ప్రక్రియ దారి తప్పుతుంది. దీంతో హానికరమైనవేవో, హాని కలిగించనివేంటో గుర్తించే సామర్థ్యం కొరవడుతుంది. హానిచేయని వాటిని కూడా హానికరమైనవిగా పొరబడి దాడి చేయటం అలర్జీలను తెచ్చిపెడుతోంది.
సోఫాలు, తివాచీలు:
ఇళ్లల్లో బట్టతో చేసిన సోఫాలు, తివాచీల వాడకమూ పెరిగింది. వీటిల్లో చేరే తవిటి పురుగులు (డస్ట్ మైట్స్) అలర్జీని ప్రేరేపిస్తాయి. అన్నింటికన్నా ఎక్కువగా అలర్జీలను ప్రేరేపించేవీ ఇవే! అలాగే పెంపుడు జంతువుల నుంచి రాలే బొచ్చు, నూగు, మృత చర్మకణాల వంటివీ అలర్జీలకు దారితీస్తున్నాయి.
కాలుష్యం:
వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగ, వాయువులతో కాలుష్యం రోజురోజుకీ పెరుగుతోంది. క్రిమి సంహారక మందుల మూలంగా తిండీ కలుషితమవుతోంది. ఇవీ అలర్జీలకు దోహదం చేస్తున్నాయి.
నివారణే కీలకం
అలర్జీ కారకాలను గుర్తించి పిల్లలను వాటికి దూరంగా ఉండేలా చూడటం చాలా ముఖ్యం.
సిజేరియన్ కాన్పులో పుట్టిన పిల్లలకు అలర్జీల ముప్పు ఎక్కువ. అందువల్ల వీలైనంతవరకు సహజ కాన్పయ్యేలా చూసుకోవాలి.
పోత పాలతో అలర్జీలు రావొచ్చు. కాబట్టి 6 నెలల వరకు విధిగా తల్లిపాలే పట్టాలి.
బయటి తిండ్లు వద్దు. ఇంట్లో వండిన తాజా ఆహారమే తినిపించాలి.
విటమిన్ డి లోపం రాకుండా పిల్లలకు రోజూ కాస్త ఎండ తగలనివ్వాలి. ఏడాది వరకు విటమిన్ డి సిరప్ ఇవ్వాలి.
స్నానం చేయించాక సాంబ్రాణి వంటి వాటితో పొగ వేయొద్దు. అలాగే పిల్లలున్న ఇంట్లో సిగరెట్లు, బీడీలు కాల్చొద్దు.
ఇంట్లో తివాచీలు లేకుండా, గోడలకు చెమ్మ, నాచు పట్టకుండా చూసుకోవాలి.
దోమలను తరిమేందుకు జేట్స్, కాయిల్స్, మ్యాట్స్, వెపరైజర్లకు బదులు దోమతెరలు వాడుకోవటం మంచిది.
అలర్జీ కారకాలు
తవిటి పురుగులు (డస్ట్ మైట్స్)
పుప్పొడి
దుమ్ము ధూళి
వాహనాలు, సిగరెట్ల పొగ
పెంపుడు జంతువుల బొచ్చు
గోడలకు పట్టే చెమ్మ, నాచుసెంట్లు
పోపు వాసనలు
చల్లటి నీరు, గాలి
బొద్దింకలు, తేనెటీగల వంటి కీటకాలు
కొన్నిరకాల మందులు
తరువాత పేజీలో.......