22 Rash, Allergies - Daddulu దద్దులు (ఎలర్జీలు)
header

Rash, Allergies - Daddulu దద్దులు (ఎలర్జీలు)

Rash….దద్దులు ...... Dr.P. Sudarsan Reddym Chief Pediatrisian, Krishna Hospital, Lakadikapool, Hyderabad

స్కార్లెట్‌ ఫివర్‌

జ్వరంతో వచ్చే బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లలో స్కార్లెట్‌ ఫివర్‌ ఒకటి. ఇది స్టెఫలోకాస్‌ బ్యాక్టిరియా వలన వచ్చే గొంతు ఇన్‌ఫెక్షన్‌. దీంతో టాన్సిల్స్‌ వస్తాయి. నొప్పి, జ్వరం, మింగటం కష్టం అవుతుంది. ఆ తర్వాత ముఖం, చాతీ, శరీరం మీద ఎర్రగా తివాచీ పరచినట్లు దద్దు వస్తుంది. ఈ దద్దు మీద చేయి పెడితే గరుకుగా అనిపిస్తుంది.
గొంతు ఇన్‌ఫెక్షన్‌తో దద్దు కూడా ఉంటే స్కార్లెట్‌ ఫీవర్‌ ఉందేమోనని అనుమానించాలి. దీనికి ఏడు రోజుల పాటు యాంటీబయోటిక్‌ మందులు ఇస్తే తగ్గిపోతుంది. అయితే సరైన మందులు వేసుకోకపోతే ఈ ఇన్‌ఫెక్షన్‌ గుండెకు వ్యాపించి ప్రమాదకరమైన రుమాటిక్‌ ఫివర్‌కు దారి తీస్తుంది.

రుబెల్లా : (జర్మన్‌ మీజిల్స్‌)

ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే చిన్న సమస్య ఈ జర్మన్‌ మీజిల్స్‌. కొన్ని సార్లు ఇది వచ్చిందనే సంగతి కూడా తెలియదు. అందుకే దీనిని త్రీడే మీజిల్స్‌ అంటారు. కొద్దిగా జ్యరం వస్తుంది. మెడ వెనుక భాగంలోని లింఫ్‌ గ్రంథులు ఉబ్బుతాయి. ఒకటి, రెండు రోజులో దద్దు కనబడుతుంది. మూడో రోజులలో మాయమైపోతుంది. మామూలు తట్టులో వచ్చే దద్దు నల్లబడి పూర్తిగా కనబడకుండి ఉండేందుకు ఒక నెల సమయం పడుతుంది. కానీ ఇది మూడు రోజుల్లోనే కనిపించకుండా పోతుంది. ఇది రాకుండా ఎం ఎం ఆర్‌ (మీజిల్స్‌ మంప్స్‌ రూబెల్లా) టీకా అందుబాటులో ఉంది.
రూబెల్లా చిన్న సమస్య కాని ఇది గర్భిణులకు వస్తే మాత్రం వారికి పుట్టే బిడ్డ అవకారాలతో పుడతారు. ఎదుగుదల లోపం, బుద్ధిమాంద్యం, కంట్లో శుక్లం, గుండె జబ్బు వంటివి వేధిస్తాయి. కాబట్టి అసలీ ప్రమాదం తలెత్తకుండా ఆడపిల్లలందరికీ ‘‘ఎం ఎం ఆర్‌’’ టీకా ఇప్పించడం తప్పనిసరి. ఈ టీకా ఏడాది నిండిన తర్వాత ఒక మోతాదు, ఐదేళ్ళ తర్వాత రెండో మోతాదు ఇస్తారు.

హెచ్‌ ఎఫ్‌ యం

గత 35 సం॥రాలలో ఎన్నడూ లేనంత ప్రబలంగా ఈ మద్య ముంచుకొచ్చిన సమస్య ఇది ఈ హ్యాండ్‌, ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌ హెచ్‌ ఎఫ్‌ యం వ్యాధి. ఇది ఎంటరో వైరస్‌ జాతికి చెందిన కాక్సాకీ వైరస్‌ మూలంగా వస్తుంది. దగ్గు,తుమ్ము ద్వారా, మలం కలుషితాల ద్వారా వ్యాపిస్తుంది. ఇందులో జ్వరంతో పాటు నోట్లో పొక్కులు వస్తాయి. దీంతో పిల్లలు తినటానికి, తాగటానికి చాలా ఇబ్బంది పడతారు. నోటి నుండి చొంగ కారుతుంది. చేతులు, కాళ్ళు మోకాళ్ళు, మోచేతులు, పిరుదులు మీద కూడా చిన్న చిన్న నీటి పొక్కులు వస్తాయి. ఈ సమస్య వారం పది రోజులో తగ్గిపోతుంది గానీ ఒక్కోసారి ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. దీంతో మొదడు వాపు, గుండె జబ్బు (మయోకార్డైటిస్‌) వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులలోనూ తేలికగా తీసుకోకూడదు. వెంటనే డాక్టరుకు చూపించాలి.

డెంగీ

ప్రస్తుతం ప్రజలను విపరీతంగా భయపెడుతున్న సమస్య డెంగీ. జ్వరంతో పాటు ఒంటిమీద చిన్న చిన్న మచ్చలు వస్తే అశ్రద్ధ చేయకూడదు. తీవ్రమైన జ్వరం, వొళ్ళునొప్పులు (బోన్‌ బ్రేకింగ్‌ ఫివర్‌) వీటితో పాటు దాహం, తలనొప్పి, కడుపు నొప్పి క్షణాలలో జ్వరం ఆరంభమై ఒంటిమీద చిన్న చిన్న దద్దు వస్తే వెంటనే వైద్యం చేయించాలి. మొదట్లో ఈ దద్దు కేవలం చర్మం ఎర్రగా కందినట్లుగా ఉంటుంది. చెవులు, చెంపలు, ఛాతీ వంటివన్నీ ఎర్రగా కందినట్లు అవుతాయి. నొక్కితే చెయ్యి అరపడి, ఆ అద్దు కనబడుతుంది. ఇలా వచ్చిన అందరికీ దద్దు రావాలని లేదు.కానీ కొందరికి రక్తనాళాల నుంచి రక్తం లీక్‌ అవుతూ నల్ల మచ్చలు (పర్పూరా) రావచ్చు. ఇలా వచ్చిన వాళ్లకు చేతితో నొక్కినా మచ్చ అలాగే ఉంటుంది. వీరిలో రక్తం గడ్డకట్టే స్వభావం తగ్గుతుంది. కానీ ప్లేట్‌లెట్ల్‌ గురించి విపరీతంగా ఆందోళన చెందాల్సిన పనిలేదు.
మామూలుగా ప్లేట్‌లెట్లు 1.5 నుండి 3.5 లక్షల మధ్య ఉండొచ్చు. కానీ డెంగీ జ్వరంలో అవి 90 వేలకు తగ్గినా ఫరవాలేదు. 60 వేల కంటే పడిపోతే రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. 20 వేలకంటే తగ్గితే కీలక అవయవాల్లో రక్తస్రావం అవుతుందేమోనని భయపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మామూలుగా డెంగీ జ్వరం రాగానే అందరూ ప్లేట్‌లెట్‌ కణాల గురించి ఆందోళన పడతారు. కానీ ఇక్కడ ఆలోచించవసింది ప్లేట్‌లెట్‌ గురించి కాదు. రక్తంలో ఉన్న ద్రవం (ప్లాస్మా) గురించి ప్లాస్మా బయటకు లీక్‌ అయిపోయి రక్తం పరిమాణం తగ్గి అది చిక్కగా తయారవుతుంది. దీంతో రక్త సాంద్రత (పీ సీ వీ) పెరిగిపోయి బీపి పడిపోతుంది. దీనివల్ల మొదడు, కిడ్నీ, గుండె, లివర్‌ వంటి కీక అవయవాలకు రక్తప్రసారం తగ్గిపోతుంది. ఇది ప్రమాదక పరిస్థితి వీరు డెంగీ షాక్‌ సిండ్రోమ్‌లోకి వెళతారు. కాబట్టి వీరిలో పోయిన ప్లాస్మాను సెలైన్‌ పెట్టటం ద్వారా తిరిగి నింపటం, రక్తం చిక్కబడకుండా చూడటం ముఖ్యం దీనికి సెలైన్‌ పెట్టటం వంటి చర్యలు కీలకం గానీ అనవసరంగా వణికిపోతూ ప్లేట్‌లెట్ లను ఎక్కించటం కీలకం కానేకాదు. అది ఆశాస్త్రీయం కూడా! సాధారణంగా డెంగీలో వచ్చే దద్దు ఎర్రగా కందినట్లు అవుతుంది. లోపల రక్తస్రావం అయితేనే అరుదుగానే, చర్మం కింద రక్తం చిమిర్చే నల్లమచ్చలు వస్తాయి. అవి వస్తే మాత్రం జబ్బు తీవ్రంగా ఉందని గుర్తించి ఆసుపత్రిలో ఉంచటం మంచిది. బీ పి చూడటం, సెలైన్‌ పెట్టడం ముఖ్యం. ప్లేట్‌లెట్లు ఎక్కించటం కాదు.

Next Page……..తరువాత పేజీలో...