అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రజలు ఆతిధ్య గుణం కలవారు తమ సంస్కృతి పట్ల అభిమానంతో కాపాడుకుంటారు.
నృత్యాలు, సంగీతంతో అనేక గిరిజన పండుగలు సంవత్సరం మొత్తం జరుగుతుంటాయి.
లోసార్ పండుగ కొత్త సంవత్సరంలో తవాంగ్ లో నిర్వహించబడే ప్రసిద్ధ చెందిన పండుగలలో ఒకటి. డ్రీ , సోలుంగ్, రెహ్ పండుగలను కూడా ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో జరుపుతారు.
అరుణాచల్ ప్రదేశ్ పర్యాటకం ద్వారా వివిధ సంస్కృతులు, ప్రజలు, ప్రకృతి, భాషలు సరిచయమవుతాయి. రాజధాని ఇటానాగర్ లో ఇటానగర్ వన్యప్రాణి అభయారణ్యం, ఇటాకోట లాంటి పర్యాటక ప్రదేశాలు వున్నాయి. తవాంగ్, అలోంగ్, జిరో, బొమ్దిలా, పసిఘాట్ లాంటి ఇతర పర్యాటక కేంద్రాలు కూడా అరుణాచల్ ప్రదేశ్ లో చూడవచ్చు. పైగా, నమ్దఫా జాతీయ పార్కు, ఈగల్ నెస్ట్ వన్యప్రాణి అభయారణ్యం, డేయింగ్ ఎరింగ్ వన్యప్రాణి అభయారణ్యం లాంటివి అరుణాచల్ ప్రదేశ్ పర్యాటకంలో ప్రధాన ఆకర్షణలు
అరుణాచల్ ప్రదేశ్ వాతావరణం
అరుణాచల్ ప్రదేశ్ వాతావరణం చాలా వైవిధ్య తో కూడి వుంటుంది, ఎత్తుతో పాటు మారుతూ వుంటుంది. హిమాలయాలలోని ఎగువ భాగంలో మంచుతో కూడిన వాతావరణం వుంటుంది. మధ్య హిమాలయాల్లో సమశీతోష్ణ వాతావరణం, దిగువ ప్రాంతంలో ఉప ఉష్ణ మండల వాతావరణం కలిగి వుంటుంది. అరుణాచల్ ప్రదేశ్ లో మే నుంచి సెప్టెంబర్ దాకా భారీ వర్షాలు కురుస్తాయి.