india tour header

Gujarat Tourism,Champner Fort

గుజరాత్ పర్వటనలో చూడదగిన మరో ప్రాంతం చాంపనర్ కోట. బనాయస్ సిటీ వడోదర నుండి ఒక గంట ప్రయాణించి పంచ్ మహా జిల్లాలో ఉన్న చాంపనర్ కు చేరుకోవచ్చు. వారాంతపు సెలవులు గడపటానికి సరైన ప్రదేశం ఇది.
చాంపనర్ యునెస్కో పరిగణనలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ ప్రదేశం. చాంపనర్-పావగఢ్ ఆర్కియాలజికల్ పార్క్, జంభుఘోడ వైల్డ్ లైఫ్ శాంక్చురి మరియు పచ్చదనంతో నిండిన పావగఢ్ కొడపై 10 నుంచి 13వ శతాబ్ధాల దేవాలయాలతో ఉంటుంది. లక్షలాదిమంది కొలిచే మా మహాకాళిక దేవాలయం కూడా ఇక్కడే ఉంది. మార్గమధ్యంలో హోటల్ దగ్గర యు ఎస్ ఆటో జెయింట్ జనరల్ మోటార్స్ ఇండియా మదర్ ప్లాంట్ ఉంది. 16వ శతాబ్దికి చెందిన ప్రముఖ సంగీతకారుడు, తాన్ సేన్ సమకాలీన ప్రత్యర్ధి బైజు బావ్రా చాంపనర్ కు చెందిన వాడని చెబుతారు.
ఒకనాటి గుజరాత్ రాజధాని అయిన చాంపనర్లో పాత భవనాలు, కోటలు, అనేక మసీదులే కాకుండా ఐదు శతాబ్ధాల ప్రాచీన వీధులు కలిగి, గత చరిత్రకు అనుసంధానంగా ఉంటాయి. మధ్యప్రాచ్య భారతంలో చాంపనర్ అత్యంత గొప్ప కోట.
ఎలా వెళ్ళాలి ? : రోడ్డు మార్గం ద్వారా బరోడా నుండి చాంపనర్ కు 49 కి.మీ. అహ్మదాబాద్ నుండి చాంపనర్ కు 147 కి.మీ. దూరం
రైలుమార్గం : బరోడా నుండి 49 కి.మీ. అహ్మదాబాద్ నుండి 145 కి.మీ. దూరం.
ఇంకా ఇతర వివరాలకు
Phone : 1800 200 5080 (Tolfree)
www.gujaratturism.com