కంసుని మామ, మగధ దేశానికి రాజైన జరాసంధునికి యాదవులకు ఎడతెగని శత్రుత్వం కలదు. శ్రీ కృష్ణుడు తన మేనమామ మథుర రాజు అయిన కంసుని చంపటం వలన ఈ శతృత్వం ఏర్పడింది. జరాసంధుడు కృష్ణుని మీదకు పదిహేడు సార్లు దాడి చేసాడు. ఈ దాడులతో విసిగిపోయిన శ్రీ కృష్ణుడు యాదవులను భవిష్యత్తులో ఇటువంటి దాడులనుండి తప్పించటానికి గిర్నార్ పర్వతాల గుండా ద స్టేట్ అఫ్ సౌరాష్ట్ర లేదా గుజరాత్ కు నడిపించాడు.
మథుర ని వదిలి పోర్ట్ ఒఖ కి దగ్గరలోని బెయ్ట్ ద్వారకలో ద్వారకను నిర్మించాడు. మిగిలిన జీవితమంతా శ్రీ కృష్ణుడు ద్వారకలోనే గడిపాడు. శ్రీ కృష్ణుని మరణానంతరం పెద్ద వరద ఈ నగరాన్ని ముంచేసింది.
ద్వారకకు ఆ పేరు సంస్కృతం లోని 'ద్వార్' అనే పదం, అంటే తలుపు అనే అర్ధం నుండి వచ్చింది, ద్వారక అంటే బ్రహ్మ వద్దకు చేరటానికి తలుపు అని భావిస్తారు. విష్ణుభక్తులకు ఈ నగరం ఒక విశిష్టమైనది. ఇక్కడి జగత్మందిర్ దేవాలయంలో ద్వారకాదీష్ (శ్రీ కృష్ణుడు)ని పూజిస్తారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటయిన నాగేశ్వర జ్యోతిర్లింగ కూడా ఈ ద్వారకలో ఉన్నది.
బెయ్ట్ ద్వారక భగవంతుడు శ్రీ కృష్ణుడు రాజధానిగా ప్రదేశంగా భావించే బెయ్ట్ ద్వారక గల్ఫ్ అఫ్ కచ్ లో నెలకొని ఉన్న ఒక చిన్న ద్వీపం. ద్వారక నుండి ఇక్కడికి చేరటానికి ముందుగా ఒఖ పోర్ట్ జెట్టికి చేరుకొని అక్కడ నుండి పడవలో ఈ ప్రదేశానికి వెళ్ళాలి. క్రీ.పూ. 3 వ శతాబ్దపు చారిత్రిక అవశేషాలు ఇక్కడ గుర్తించబడ్డాయి.
శంఖసురుని భగవంతుడు విష్ణువు సంహరించిన ప్రదేశంగా కూడా బెయ్ట్ ద్వారక ఇతిహాసం చెపుతుంది. అందుకే ఈ ద్వీపం బెయ్ట్ శంఖోధర అని కూడా పిలువబడుతుంది. బెయ్ట్ ద్వారకా లో డాల్ఫిన్ లని చూడవచ్చు. ఇక్కడ పిక్నిక్ లకు, కాంపింగ్లకు మరియు సముద్ర విహారానికి వెళ్ళవచ్చు.
ద్వారకా మరియు బెయ్ట్ ద్వారకాలోని అనేక పవిత్ర దేవాలయాలను దర్శించిటానికి ప్రతి ఏడూ అనేక మంది పర్యాటకులు వస్తారు. ద్వారక నాధుని దేవాలయం, నాగేశ్వర జ్యోత్ర్లింగ దేవాలయం, మీరాబాయి దేవాలయం, శ్రీ కృష్ణ దేవాలయం, హనుమంతుని దేవాలయం మరియు బెయ్ట్ ద్వారకా లోని కచోరియు మొదలగు ముఖ్య ఆధ్యాత్మిక ప్రదేశాలు ద్వారకాలో ఉన్నాయి. ఇటువంటి ఆధ్యాత్మిక వైశిష్ట్యం కల ద్వారక ఎప్పటికీ గుజరాత్ లోని ముఖ్య పర్యాటక ప్రదేశం.