మహాత్మా మందిర్, అక్షరధామ్ ఆలయం, ఇంద్రోడా డైనోసార్, శిలాజ పార్కు, సరిత ఉద్యాన్ లాంటి ప్రాంతాలు గాంధీనగర్ లో చూడదగ్గవి. మహాత్మా మందిరం బాపూజీ జీవిత సమాచారం, సాహిత్యం వివరణలు అందించే కేంద్రం. ఈ ప్రాంగణంలో ఆడిటోరియం, ప్రేయర్ హాలు, ధ్యాన మందిరం, వడికే పెద్ద రాట్నం ఉన్నాయి.
గాంధీనగర్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదాలాజ్ మెట్ల బావి కూడా ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ బావి గోడలపై జైన్, హిందూ మతాలు, పౌరాణిక అర్ధాలతో, అనేక రాతి చేక్కుళ్ళతో ఐదు అంతస్థులను కలిగిఉంది.
భారతదేశ జురాసిక్ పార్కుగా పిలువబడే ఇంద్రోడా డైనోసార్, ఫాసిల్ పార్కు మరో ఆసక్తికరమైన పర్యాటక కేంద్రం. ఈ ప్రాంతం డైనోసార్ గుడ్లకు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉత్పత్తి కేంద్రం. ఈ పార్కులో దుప్పుల పార్కు, పక్షుల పార్కు, పాముల పార్కు మొదలైన అనేక ఇతర విభాగాలు కూడా ఉన్నాయి. ఇక్కడి ఎడ్యుకేషనల్ పార్కు లో సముద్ర క్షీరదాలకు చెందిన అనేక అస్తిపంజరాలు కూడా ఉన్నాయి. ఈ పార్కు లోపల అడవిలో సరీసృపాలు, నీల్గాయి లు, లాంగార్స్, మగకోళ్ళు వంటి అనేక వన్య ప్రాణులను కూడా చూడవచ్చు. ఈ పార్కు గుజరాత్ ఎకోలజికల్ ఎడ్యుకేషన్, రిసర్చ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నడుస్తోంది.
అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి స్థానిక, అంతర్జాతీయ ప్రయాణీకులు గాంధీనగర్ చేరుకోవచ్చు గాంధీనగర్ స్థానికంగా విటిసిఒఎస్ సర్వీసుతో, ఎక్కువగా సిఎంజి ఇంధనంతో నడుపబడే స్థానిక బస్సులు ఉన్నాయి. అహ్మదాబాద్, సమీప రైల్వే స్టేషన్. ఇది భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానం చేయబడి ఉన్నది.