కథియవార్ ప్రాంతాన్ని సౌరాష్ట్ర అని కూడా అంటారు. ఈ ప్రాంతం లో కల పురావస్తు చిహ్నాలు పర్యాటకులకు ఆకర్షణలే. రాస్ మరియు గర్బాలలో చేసే ప్రసిద్ధి వేడుకలు గుజరాత్ సంస్కృతికి ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తాయి. సముద్రానికి సమీపం కావటం వలన వర్షాలు అధికం. వేసవులు అధిక ఉష్ణోగ్రతలు కలిగి, శీతాకాలం మాత్రం పర్యటనకు అనుకూలంగా వుంటుంది. గుజరాత్ లో ప్రధాన భాష ప్రామాణిక గుజరాతి. ఇది కాక దీని సంబంధ పార్సీ గుజరాతీ, గాంతి, కతిఅవాది మరియు సింది, కుచి వంటివి కూడా మాట్లాడతారు.
పరిశుభ్రమైన , అందమైన అరేబియా సముద్ర బీచ్ ల నుండి సహ్యాద్రి, ఆరావళి మరియు సాత్పూర పర్వత శ్రేణుల వరకూ మరియు విశిష్ట భౌగొళికత కల రాన్ ఆఫ్ కచ్ వంటి ప్రదేశాలతో పర్యాటకులకు మరి ఏ ఇతర రాష్ట్రం అందించలేని ప్రదేశాలను చూపిస్తుంది.
అందులో తితాల్ ఒక నల్లటి ఇసుక కల బీచ్, మాండవి బీచ్, కర్వాద్ బీచ్, ఆహ్మేదాపూర్, సోమనాథ్ బీచ్, పోర్బందర్ బీచ్, ద్వారకా బీచ్, ...ఈ రకంగా గుజరాత్ లోని బీచ్ లు లెక్క లేనన్ని సముద్రతీరాలున్నవి.
అదే విధంగా యాత్రా స్థలాలు కూడాను. ద్వారకా, సోమనాథ్ ల గురించి మన పురాణాల లోనుచెప్పబడినవి. గిర్నార్ హిల్స్ లోని అంబాజీ టెంపుల్, హిందూ జైన దేవాలయాలు ప్రసిద్ధి. గుజరాత్ లోని నేషనల్ పార్క్ మరియు వన్య సంరక్షణాలయం సుమారు 40 రకాల వివిధ జంతువులను కలిగి వున్నాయి. వాటిలో ఆసియా సింహం, అడవి గాడిద, బ్లాక్ బాక్, గిర్ పార్క్, వంస్డా నేషనల్ పార్క్, వేరవదర్ బ్లాక్ బాక్ నేషనల్ పార్క్, నారాయణ్ సరోవర్ వైల్డ్ లైఫ్ శాంక్చురి,తొల లేక్ బర్డ్ శాంక్చురి, కుచ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ శాంక్చురి వంటివి రాష్ట్రంలోని వన్య జంతువులను పరిరక్షించే కొన్ని ప్రధాన కేంద్రాలు. భారతదేశంలో ఆర్ధికంగా మరియు సంస్కృతి పరంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో గుజరాత్ కూడా ఒకటి.
ప్రపంచం అంతా అభినందించే సాంప్రదాయ హస్తకళా వస్తువులను కూడా ఇక్కడే తయారవుతాయి. ఇక్కడి పురుషులు ధరించే తలపాగా, ముడి వేసిన జాకెట్లు, పొడవు చేతుల చొక్కాలు, బేగి బాటం కల పాంట్లు, పర్యాటకులు వారిని గమనించేలా చేస్తాయి. రంగు రంగుల గాగ్రా మరియు చోళీలు అద్దకపు పని మరియు ఎంబ్రాయిడరీలతో తప్పక కొనాలనిపిస్తాయి. పటాన్ లో తయారయేయ పటోల చీరాలు తప్పక కొనాలనిపిస్తుంది.