ఇది దేశంలోనే అతి పెద్ద జైన్ టెంపుల్. భావనగర్‌కు (గుజరాత్) 51 కిలోమీటర్ల దూరంలో ఉంది పలిటన. ఇది 863 దేవాలయాల సముదాయం. శత్రుంజయ హిల్‌పైన పలిటన దేవాలయం కొలువుదీరి ఉంది. మొత్తం 3950 మెట్లు 3.5 కిలోమీటర్లు అధిరోహిస్తే ఈ మందిరాలను చేరుకోవచ్చు. క్రీ.శ. 900 ఏళ్ల కాలంలో రెండుదశలుగా నిర్మించారు. 16వ శతాబ్దిలో ఈ దేవాలయ నిర్మాణ పునరుద్ధరణ చేపట్టారు.
రోడ్డుమార్గం గుండా భావనగర్‌కి చేరుకోవాలంటే ముంబై వయా అహ్మదాబాద్ వెళ్లే జాతీయరహదారి మీదుగా 200 కిలోమీటర్లు ప్రయాణించాలి. అహ్మదాబాద్‌లో రైల్వేస్టేషన్ ఉంది. ముంబై, అహ్మదాబాద్‌ల నుంచి భావనగర్‌కు డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు: టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు 9493350099 ఫోన్ చేసి కనుక్కోవచ్చు. E-mail: tibhyderabad@gujarattourism.com