header

మొథెరా సూర్యదేవాలయం / Sun God Temple

మొథెరా సూర్యదేవాలయం

మొథెరా సూర్యదేవాలయం వెయ్యేళ్ళ ప్రాచీనమైనది. ఈ దేవాలయాలు చరిత్రలో, సంస్కృతిలో భాగమై ఉండగా దేవాలయాన్ని చూడగానే చరిత్ర విధ్వంసం పూర్తిగా జరగలేదన్న గతాన్ని తెలుసుకుంటాం. మొధెరా దేవాలయం మన సంస్కృతికి, మన మూలాలకు గుర్తింపు.
సోలంకీ వంశానికి చెందిన సూర్యవంశ చక్రవర్తి సూర్యభగవానుడికి ఘనకకీర్తిని ఆపాదిస్తూ ఈ దేవాలయాన్ని మూడుభాగాలుగా నిర్మించారు. మూడు విడి విడిగానే ఉంటూ అక్షాన్ని చుట్టే విధంగా విడిభాగాలను సమగ్రపరచి కట్టబడింది. సూర్యకుండ్, సభామండప్, గుడామండప్ అనే మూడు భాగాలుగా ఉంటుందీ దేవాలయం. సూర్యుడు భూమధ్య రేఖకు దూరంగా వుండి తిరిగి రావడానికి విరామం తీసుకునే వేసవిలో జూన్ 21వ తేదీన సూర్యకిరణాలు పడే విధంగా యంత్రనిర్మాణ, భూగోళ శాస్త్రానికి సంబంధించిన రెండు దృగ్గోచరాలతో దేవాలయం కట్టబడింది. సందర్శకులకు ఉల్లాసపూరిత అనుభూతులను అందిస్తుంది. అహ్మదాబాద్ నగరానికి 98 కి.మీటర్ల దూరంలో మొధెరాలో గల దేవాలయం రేఖాగణితానికి చక్కని ఉదాహరణ.
సూర్యదేవాలయ పర్యాటక ప్రాముఖ్యానికి తోడు జనవరిలో జరిగే వార్షిక నృత్య ఉత్సవం కూడా మరింత వన్నె తెస్తుంది. గుజరాత్ పర్యాటకశాఖ నిర్వహించే ఈ కార్యక్రమం విద్యుత్ దీపకాంతులు, రంగులు, శబ్ధాలతో ప్రేక్షకులను మైమరపిస్తుంది.
ఎలా వెళ్ళాలి ? రోడ్డు మార్గంలో అహ్మదాబాద్ నుండి 98 కి.మీ దూరం.
రైలుమార్గం : మెహ్సన : 28 కి.మీ. అహ్మదాబాద్ : 99 కి.మీ.