Rani Ki Wav.....రాణి-కి-వావ్
పటాన్ లోని రాణి-కి-వావ్ స్టెప్ వెల్స్ (దిగుడు బావి)లో వాతావరణం చల్లగా ఉంటుంది. అహ్మదాబాద్ కు 128 కి.మీటర్ల దూరంలోగల ఈ ప్రదేశం ఒకప్పుడు సోలంకీ వంశీయుల రాజధాని. సరస్వతీ నదీతీరాన 11వ శతాబ్ధంలో నిర్మించిన రాణి-కి-వావ్ ను 1950 లో గుర్తించారు. మొదట్లో స్మారక చిహ్నంగా నిర్మించారు కానీ, తదుపరి కాలంలో భూగర్భంలో నీటి వనరులు మరియు నిల్వవ్యవస్ధ కోసం మార్పులు చేశారు. ఇప్పుడు దీనిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రాపర్టీగా ప్రకటించడంతో వావ్ గొప్పదనం ప్రపంచానికి తెలియబోతుంది.
చాలామంది రాజులు తమ భార్యల కోసం కట్టడాలు నిర్మించిన దాఖలాలు చరిత్రలో అనేకం గమనించవచ్చు. కానీ,రాణి-కి-వావ్ సోలంకి వంశంలో చక్రవర్తి భీమ్ దేవ్ కు గుర్తుగా అతని రాణి ఉదయమతి నిర్మింపజేసింది.
అత్యద్భుతంగా, చక్కగా చెక్కిన శిల్పాల అలంకరణలతో ఈ కట్టడం ఉంటుంది. దాదాపు 64 మీటర్ల పొడవు, 20 మీటర్ల విస్తీర్ణంలో, 27 మీటర్ల లోతుతో ప్రతిగోడనూ, ప్రతి స్ధంభాన్నీ అందంగా మలచారు.
ఎలా వెళ్ళాలి : రోడ్డు మార్గం : అహ్మదాబాద్ నుండి 128 కి.మీ.
రైలు మార్గం : అహ్మదాబాద్ 128 కి.మీ. మెహ్సన : 56 కి.మీ.దూరం.