header

Haryana Tourism / హర్యానా పర్యాటకం

Haryana Tourism / హర్యానా పర్యాటకం

భారత దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో హర్యానా ఒకటి. 1966 లో పంజాబ్ నుండి వేరుపడి ఈ రాష్ట్రం ఏర్పడింది. తూర్పున ఉత్తర ప్రదేశ్, పశ్చిమాన పంజాబ్, దక్షిణాన రాజస్థాన్, తూర్పున హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుగా కలిగి వుంది హర్యానా. భారత రాజధాని డిల్లీకి ఆనుకుని వున్నది. హర్యానా చాలా అందమైన, విశిష్ట పర్యాటక ప్రాంతాలను అందించే రాష్త్రం. హర్యానా లోని పర్యాటక ప్రాంతాలు డిల్లీ నుంచి కేవలం నిమిషాల్లో చేరుకోవచ్చు.
ద్వాపరయుగంలో మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం ఈ రాష్ట్రంలోనే వుంది. ఫరీదాబాద్ లోని బద్ఖల్ సరస్సు కూడా ఇక్కడ చూడదగిన మరో ఆకర్షణ.
భివాని వద్ద వున్న నక్షత్ర నిర్మాణం కూడా పర్యాటకులను ఆకర్షించే ప్రదేశం. దేవాలయాలు, కోటలు లేక సరస్సులు, పార్కులు హర్యానా పర్యాటకం లో దర్శించవచ్చు. హర్యానా ప్రజలు, సంస్కృతి
సాంప్రదాయాలు గల ప్రజలు. గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన రాష్ట్రం హర్యానా. వేద కాలం నాటి చరిత్ర కలిగిన ఈ రాష్ట్రం గురించి హిందూ పురాణాల్లోను ప్రస్తావన వుంది. విశ్వ విధాత బ్రహ్మ ఇక్కడే తపస్సు చేసి సృష్టి మొదలు పెట్టాడంటారు.
మహాభారతాన్ని రాయడానికి వేద వ్యాసుడు ఈ ప్రాంతాన్నే ఎంచుకున్నాడు. ఇక్కడి ప్రజలు ఇప్పటికీ తమ సంప్రదాయాలను కొనసాగిస్తుంటారు, యోగ, ధ్యానం, మంత్ర పునశ్చరణ లాంటివి ఇప్పటికీ చేస్తుంటారు.
హర్యానా మునుపటి పంజాబ్ లోని భాగం కావడంతో ఈ రెండు రాష్ట్రాల సంస్కృతులు దగ్గరగా వుంటాయి. హర్యాన్వీ, హిందీ, పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీష్ ఇక్కడ ఎక్కువగా మాట్లాడే భాషలు. ప్రధాన పండుగలన్నీ ఈ రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటారు.
హర్యానాలో జరుపుకునే ప్రసిద్ధ పండుగలలో ఒకటి లోహ్రీ. శీతాకాలం తరువాత, మకర సంక్రాంతికి ముందు వచ్చే కాలాన్ని స్వాగతించడానికి ఈ పండుగ జరుపుకుంటారు. సంప్రదాయంగా పంజాబ్ లో ఈ పండుగ పుట్టినప్పటికీ హర్యానా మొత్తంలో కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు.
గంగోర్, బైసాఖీ, గుగ్గ్ నవమి, సూరజ్ కుండ్ హస్తకళా ఉత్సవం, కార్తిక ఉత్సవం హర్యానాలో జరుపుకునే ఇతర పండుగలు. హర్యానా పర్యాటక శాఖ ఏర్పడిన సెప్టెంబర్ 1 వ తేదీని హర్యానా దినోత్సవం గా జరుపుకుంటారు.
హర్యానా ప్రజలు ఎక్కవగా రొట్టెలను ఆహారంగా తింటారు. ఇక్కడి సంస్కృతి లాగే ఇక్కడి వంటకాలు కూడా చాలా సరళంగా వుంటాయి. ఇక్కడి ప్రజలు, వేడిగా, రుచిగా వుండే పౌష్టికాహార రొట్టెలను ఇష్టపడతారు. ఈ రాష్ట్రం పాల ఉత్పత్తి ఎక్కువ కనుక, ఇక్కడి మిఠాయిల్లో పాలు, పాల పదార్ధాలు వాడతారు. మెట్రో నగరాల్లో జంక్ ఆహారం తింటారు గానీ, హర్యానా ప్రజలు తేలిగ్గా వుండే పౌష్టికాహారం ఇష్టపడతారు. లస్సీ, కచ్రీ కీ సబ్జీ, దాల్ మిశ్రమం, మేతి ఘజ్జర్ లాంటివి ఇక్కడి ప్రసిద్ధ వంటకాలు.
హర్యానాలో ఇక్కడి వేసవికాలం చాలా వేడిగా వుండి, శీతాకాలంలో చాలా చల్లగా వుంటుంది. కర్నాల్, అంబాలా జిల్లాల్లో తప్ప హర్యానా లో వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడవు. మహేంద్ర ఘర్, హిస్సార్ జిల్లాల్లో కనిష్ట వర్షపాతం నమోదౌతుంది.
ఎలా వెళ్లాలి ?
వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా హర్యానా అన్ని ప్రధాన నగరాలకు కలపబడి వుంది. రాజధాని డిల్లీకి దగ్గరగా వుండడం వల్ల హర్యానా చేరుకోవడం చాలా తేలిక.