india tour header

Barot Vally / బరోట్ లోయ

Barot Vally / బరోట్ లోయ
హిమాచల్ ప్రదేశ్ లోని సుందరమైన ప్రదేశాలలో బరోట్ లోయ ఒకటి. ఇంగ్లీష్అక్షరం వి ఆకారంలో ఏర్పడిన ఈలోయ ఉహల్ నది ద్వారా ఏర్పడినది. ఇరువైపులా హిమాలయ పర్వతశ్రేణులు. సముద్రమట్టానికి 1819 మీటర్ల ఎత్తున ఏర్పడిన ఈ లోయలో నదీతీరం వెంటగ్రామం ఉంది. ఈ ప్రాంతాన్నే జోగిందర్ లోయ అంటారు. మండి పట్టణానికి 70 కి.మీ. దూరంలో ఉన్న బరోట్ లోయ అందాలు చూడటానికి వేలాది పర్యాటకులు వస్తుంటారు. బరోట్ లోయ వెళ్ళటానికి రోడ్డు మార్గం (40 కి.మీ) ట్రాలీల ద్వారా ( 12 కి.మీ) ఎత్తులో ప్రయాణ భయం లేనివారికి ట్రాలీ ప్రయాణం ఓ చక్కని అనుభూతి.
బరోట్ గ్రామంలో చేపలను గాలం వేసి పట్టుకునే వినోద సౌకర్యం కలదు. పర్వతాల మీద నుండి జలజలా పారుతూ వచ్చే సెలయేళ్ళు, చిన్న నదుల వంటి వాటిలో చేపలను పట్టటం ఒక వినోదం. అరుదైన హిమాలయ జాతి మొనాల్ చేప దొరికితే ఇంకా ఆనందం.
ఊహుల్ నది దాటితే ఆవతలి వైపున వన్యప్రాణి రక్షిత ప్రదేశం వస్తుంది. ఇది దట్టమైన ఓక్,సెడార్ వృక్షాలతో నిండి ఉన్నఅడవి. ఇందులో పలురకాల పక్షిజాతులు, హరిణులు, హిమాలయ నల్ల భల్లూకాలు, చిరుతలు, ఎగిరే ఉడతలు వంటి వాటిని చూడవచ్చు.
బరోట్ అందాలను తిలకించేందుకు కొండల మధ్యగా నడవవచ్చు. ట్రెక్కింగ్ చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. బరోట్ లోయ అందాలు మనలను కళ్ళు తిప్పుకోనీయవు. ఎందుకంటే ప్రకృతి తన అందచందాలను పరచిన తివాచీ బరోట్ లోయ. 365 రోజులలో ఎప్పుడైన పర్యాటానికి అనుకూలం.