హిమాచల్ ప్రదేశ్ /Himachal Pradesh Tourism
హిమాచల్ ప్రదేశ్ దేవభూమి, వేసవి విడిది, సాహసక్రీడలకు వేదిక. శైవ క్షేత్రాల నిలయం, మంచు పర్వతాలతో కూడిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్.
హిమాచల్ ప్రదేశ్ సముద్ర మట్టానికి 460 మీటర్ల నుండి ప్రారంభమవుతుంది.అక్కడనుండి 6600 మీటర్ల వరకు వ్యాపించిన పర్వతాలు ఇక్కడ ఉన్నాయి.
చుట్టూ పచ్చని కొండచరియలు, అడవులు, మంచుతో కప్పబడిన పర్వతాలు, మధ్యలో లోయలు, ఆ లోయలగుండా ప్రవహించే నదులు. ఎటు చూసినా మనోహరమైన వాతావరణం.
హిమాచల్ ప్రదేశ్ శివాలిక్, నీక్ పంజార్, జక్సార్ పర్వతశ్రేణులు, రవి, బీస్, సట్లెజ్, చంద్రభాగ్, యమునా నదులు కలిగిన రాష్ట్రం. పండ్లతోటలు, పచ్చిక బయళ్ళకు నిలయం.
బ్రిటీష్ పాలకులకు వేసవి విడిదిగా ఉన్న ప్రాంతం హిమాచల్ ప్రదేశ్.
దలైలామా ప్రస్తుతం ఇక్కడ ఉన్న ధర్మశాలలోనే రాజకీయ ఆశ్రయం పొంది నివసిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్ లో స్థానిక తెగల జానపద గాథలు, వారి సంస్కృతి సంబరాలు విశేషంగా కనిపిస్తాయి.
నేటికీ భారతదేశంలో వేసవి విడిదిగా లక్షలాది మందినాకట్టుకుంటున్న ప్రదేశం హిమాచల్ ప్రదేశ్
తరువాత పేజీలో పూర్తిగా ...........