జంజెహ్లికి అతి దగ్గరలో గల కర్పోగ్ లోయలో ఉన్న అతి సుందరమైన ప్రాంతం చిండి. ఈ ప్రదేశంలో చిన్న చిన్న అనేక దేవాలయాలు ఉన్నాయి. అన్ని దేవాలయాలు పురాతన కాలం నాటివే. చిండి ఇప్పుడు యాపిల్ తోటలకు ప్రసిద్ధి. పెంకులతో
కప్పబడిన చిన్న కాటేజ్ లు అనేకం తోటల మధ్య, కొండచరియల మీద పర్యాటకుల కోసం ఏర్పాటు చేయబడ్డాయి. `హిమాచల్ పర్వటనలో పర్యాటకులు ఇష్టపడేది చిండి పర్వటన.
వేసవిలో చల్లని వాతావరణం ఉంటుంది. మిగిలిన కాలంలో కూడా వాతావరణం పర్యాటనలకు అనుకూలంగా ఉంటుంది. అందుకే సంవత్సరం పొడవునా పర్యాటకులతో చిండి కళకళ లాడుతూ వుంటుంది. మండి-జంజెహ్లి-చిండి-
కర్పోగ్ లోయ కలిపి ఒకేసారి చూసిరావచ్చు. ఒకే చోట కూర్చుని ఆనందాంగా గడపాలంటే మాత్రం చిండిలో ఉండాల్సిందే.
చిండిలో పది నుండి పదిహేనుదాకా దేవాలయాలున్నాయి. వీటిలో మమళేశ్వర్ మహాదేవ్ మందిరం,కామాక్ష్యదేవి ప్రసిద్ధి చెందినది. ఇవి కాలపరంగా, ఆద్యాత్మికంగా పేరుగాంచినవి. నిర్మాణంలో మాత్రం మామూలుగా ఉంటాయి. సిమ్లా నుండి మండీ మీదుగా చిండికి వెళ్ళవచ్చు.