యాపిల్ తోటల పెంపకానికి నిలయం చోపాల్. ఎటు చూసినా కనుచూపు మేరలో అంతా యాపిల్ తోటలే. ఈ ప్రదేశంలోని గ్రామాల మధ్యగా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళటం మంచి అనుభవం. ఎత్తైన వృక్షాలు కలిగిన అడవి గుండా అడుగులు వేస్తూ వెళ్ళాలి. ఆ బాటలో మరోగ్ గ్రామం కనిపిస్తుంది. ఆసియా ఖండంలోనే అత్యంత సంపద కలిగిన గ్రామంగా ఈ గ్రామానికి గుర్తింపు ఉంది.
ఈ దారిలోనే సరైన్ గ్రామంలో బిజత్ మహారాజ్ మందిరం ఉన్నది. రెండు గోపురాలు కలిగిన మందిరం ఇది. గ్రామీణ పర్వటనకు ఎంతో ఉత్తమమైనదిగా గుర్తించారు.
యాపిల్ పంటకోతకు వచ్చిన సమయంలో మాత్రం చోపాల్ గ్రామం చాలా సందడిగా కనిపిస్తుంది. చోపాల్ మిగిలిన కాలాలలో ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ప్రవహించే సెలయేర్ల ధ్వనులు, చుట్టూ ఎగురుతూ తమ కూతలతో చెవులకు విందుచేసే పక్షులు పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. చండీఘర్ నుండి చోపాల్ కు 180 కి.మీ దూరం. బస్సు సౌకర్యం కలదు.