శివాలిక్ పర్వత శ్రేణిలో 3647 మీటర్ల ఎత్తున వున్న ప్రదేశం చుర్దార్. గిరి నది చుట్టివున్న ఈ ప్రదేశం హిమాలయ పర్వత శ్రేణులలో తొలిగా ఎక్కిన పెద్ద పర్వతం కలిగినది చుర్దార్ లోనిదే. ఈ పర్వత ప్రాంతం పర్వతారోహకులకు ఆనందం కలిగించేది.పాదం మోపితే పొడి పొడిగా రాలుతుండే మంచు మీద నడుస్తూ ఎక్కుతూంటే దూరంలోని సిమ్లా, కసౌలి పట్టణాలలో వెలుగుతున్న లైట్ల కాంతులు మెరుస్తూ కనిపిస్తాయి
ఈ పర్వత ప్రదేశాలలో శైవ మందిరాలు అనేకం వున్నాయి. నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. చురుశ్వేర మహాదేవ్ మందిరం పేరు గాంచినది. ఇది హిమాలయ పర్వత ప్రాంతంలో వన్యప్రాణి సంరక్షణ ప్రదేశంగా కొద్ధి సంవత్సరాల క్రితం ప్రకటించారు. కస్తూరి మృగం నివసించేది ఇక్కడే.
చండీఘర్ నుండి నౌరాధార్ వరకు రోడ్డు మీద ప్రపయాణం అక్కడ నుండి 20 కి.మీ ట్రెక్కింగ్ చేస్తే శిఖరం చేరగలుగుతారు. ఏప్రిల్ నుండి నవంబర్ వరకు ఈ ప్రదేశానికి వెళ్ళేందుకు అనుకూల సమయం.