india tour header

హిమాచల్ ప్రదేశ్ /Himachal Pradesh Tourism

హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ కు తూర్పు వైపున టిబెట్, పడమటి వైపున పంజాబ్, మరియు జమ్మూ & కాశ్మీర్ ఉత్తరం వైపున సరిహద్దులుగా ఉన్నాయి. దేవ భూమి చెప్పబడే హిమాచల్ ప్రదేశ్ పర్యాటకులకు దట్టమైన పచ్చటి లోయలు, మంచు శిఖరాలు, మంచు కొండలు, అందమైన సరస్సులు, పచ్చని పచ్చిక మైదానాలతో ఒక స్వర్గాన్ని తలపిస్తుంది.
వాతావరణం హిమాచల ప్రదేశ్ లో శీతాకాలం అక్టోబర్ లో మొదలై, మార్చ్ చివర వరకూ వుండి సరైన పర్యటనకు అవకాశం కల్పిస్తుంది.
భాష హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లో హిందీ ఎక్కువగా మాట్లాడుతారు.
హిమాచల్ ప్రదేశ్ లో12 జిల్లాలు కలవు. ప్రతి జిల్లాలోను అనేక పర్యాటక ప్రదేశాలు కలవు. సైట్ సీయింగ్, మతపర మైనవి, ట్రెక్కింగ్, పర్వతారోహణ, ఫిషింగ్, రివర్ రాఫ్టింగ్, స్కీయింగ్, పారా గ్లైడింగ్, ఐస్ స్కేటింగ్, గోల్ఫ్ వంటివి ఎన్నో కలవు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ ఈ జిల్లాలను నాలుగు సర్కిల్స్ గా విభజించినది. అవి సట్లేజ్ , బియాస్ , దౌలాధస్ర మరియు ట్రైబల్ సర్కిల్స్. బియాస్ నది ప్రఖ్యాత మనాలి, కులు వాలీల గుండా ప్రవహిస్తుంది. ఈ సర్కిల్ పర్యాటకులకు దేవదారు అడవులు, పైన్ చెట్లు, ఆల్పైన్ పొలాలు, పర్వత వాలులు, పచ్చటి మైదానాలు , పూవుల తోటలు, పండ్ల తోటలు మొదలైనవి చూపుతుంది. గిరిజనుల నివసించే ప్రదేశాలలో, మంచు కొండలు, మంచుతో గడ్డకట్టిన సరస్సులు, కనుమలు, అందమైన ఆరామాలు, లామాలు, జడల బర్రెలు కనపడతాయి. గొప్ప సాంప్రదాయక విలువలతో కూడిన ఈ ప్రదేశం అతి గొప్ప సాహస క్రీడలకు ప్రసిద్ధి.
హిమాలయాల వెలుపలి భాగంగా చెప్పబడే ధౌళాధర్ సర్క్యూట్ డల్హౌసీ తో మొదలై బద్రినాథ్ తో ముగుస్తుంది. ఈ సర్క్యూట్ కాంగ్రా వాలీ నుండి బాగా కనబడుతుంది. సట్లేజ్ సర్క్యూట్ శివాలిక్ పర్వతాల దిగువ భాగ కొండలను చూపుతుంది. ఈ సర్క్యూట్ లో అందమైన పచ్చని ఆపిల్ తోటలు, పైన్ మరియు దేవదార్ అడవులు , సట్లేజ్ నది వంటివి పర్యాటకులకు ఆనందం కలిగిస్తాయి.
'దేవతల నివాసం ' గా చెప్పబడే ఈ రాష్ట్రం లో అనేక హిందూ దేవాలయాలు కలవు. జ్వాలాముఖి, చాముండా, వజ్రేశ్వరి, చిన్తపుర్ని, వైద్యనాధ్, లక్ష్మినారయన్, చౌరాసి దేవాలయాలు వాటిలో కొన్ని. అనేక గురుద్వారాలు మరియు చర్చిలు కూడా రాష్ట్రంలోని వివిధ భాగాలలో కలవు. పవొంతా సాహిబ్, రేవల్సార్ మరియు మనికారాన్ ప్రదేశాలు ప్రధాన సిక్కుల మత కేంద్రాలు. క్రిస్ట్ చర్చి కసౌలి, క్రిస్ట్ చర్చి సిమ్లా మరియు సైట్ జాన్స్ చర్చి వంటివి ప్రధాన క్రైస్తవ మత చర్చిలు.
ప్రకృతి ప్రేమికులకు గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, పిన్ వాలీ నేషనల్ పార్క్, రేణుక శాంక్చురి , పాంగ్ డం శాంక్చురి, గోపాల్పూర్ జూ, కుఫ్రి వంటివి ప్రసిద్ధ ప్రదేశాలు. కాంగ్రా ఫోర్ట్, జుబ్బల్ పాలస్, నగ్గర్ కేజల్, కమరు ఫోర్ట్, గోండ్లా ఫోర్ట్, క్రిస్ట్ చర్చి, చాప్స్లీ, వుడ్ విల్లా పాలస్, చైల్ పాలస్ వంటి ప్రదేశాల లో రాచరిక వైభవం చూడవచ్చు.
పురాతన రాజుల కాలం నాటి చరిత్రకు సంబంధించిన అనేక మ్యూజియం లు మరియు గేలరీ లు కూడా కలవు. వాటిలో స్టేట్ మ్యూజియం, కాంగ్రా ఆర్ట్ గేలరీ, భూరి సింగ్ మ్యూజియం, రోరిచ్ ఆర్ట్ గేలరీ మరియు శోభా సింగ్ ఆర్ట్ గేలరీలు ప్రధానమైనవి. ప్రశాంతంగా సమయం గడపాలనుకునే వారికి అందమైన అనేక సరస్సులు కలవు. వాటిలో ప్రశార్ లేక్, ఖజ్జాయర్ లేక్, రేణుక లేక్, గోవింద్ సాగర్ లేక్, దళ్ లేక్, పాంగ్ డాం లేక్, పండో లేక్, మని మహేష్ లేక్ మరియు బ్రిఘు లేక్ వంటివి కొన్ని.
హిమాచల్ ప్రదేశ్ అనేక ఉత్సవాలకు, వేడుకలకు కూడా పేరు పొందినది . ప్రతి ఏటా వింటర్ కార్నివాల్ శివరాత్రి, లాదర్చా ఫెయిర్, మిన్జార్ ఫెయిర్, మని మహేష్ ఫెయిర్, ఫులేచ్, కులు దసరా లావి ఫెయిర్, రేణుక ఫెయిర్ , ఐస్ స్కేటింగ్కార్నివాల్, వంటివి ప్రసిద్ధి. బీర్, మనాలి, బిలాస్పూర్, రోహ్రు వంటి ప్రదేశాలు పర్యాటకులు అభిలషించే సాహస క్రీడలైన ఏరో క్రీడలు...పారా గ్లైడింగ్ మరియు హాంగ్ గ్లైడింగ్ లకు ప్రసిద్ధి.