india tour header

Kangra / కాంగ్రా

Kangra / కాంగ్రా
కాంగ్రా హిమాచల్ ప్రదేశ్ లోని మంజి, బెనెర్ కాలువలు కలిసే ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశం ఈ ప్రాంతానికి దేవ భూమి అని కూడా పిలుస్తారు. దేవభూమి అనగా దేవుళ్ళు నెలకొని ఉన్న ప్రాంతం. ఈ ప్రదేశంలో ఆర్యులకి పూర్వం ఆర్యేతరులు నివసించినట్టుగా వేదాలలో చెప్పబడినట్టుగా భావిస్తారు. గొప్ప భారతీయ ఇతిహాసమైన మహాభారతంలో, ఇప్పటి కాంగ్రాని త్రిగర్త రాజ్యంగా ప్రస్తావించబడింది.
కరేరి లేక్, బగలాముఖి టెంపుల్ మరియు కాళేశ్వర్ మహాదేవ టెంపుల్ వంటి అధ్బుతమైన ఆకర్షణియ ప్రదేశాలకు పర్యాటకులు విచ్చేయవచ్చు. సముద్ర మట్టానికి 2934 మీటర్ల ఎత్తులో ఉన్న కరేరి చెరువును చేరుకోడానికి ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. దౌలాధర్ రేంజ్ నుండి కరిగే మంచు ద్వారా వచ్చే నీటితో ఈ చెరువు నింపబడుతుంది. కాళేశ్వర్ మహదేవ్ టెంపుల్ భూగర్భంలో ఉన్న శివ లింగం ఎంతో మంది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.
గులేర్ రియసత్, హరీపూర్-గులేర్ మరియు బ్రజేశ్వరి టెంపుల్ కూడా పేరెన్నికగన్న పర్యాటక ప్రదేశాలు. బ్రజేశ్వరి దేవాలయం ఒక పుణ్య క్షేత్రంగా ప్రసిద్ది చెందింది. ప్రతి రోజు అధిక సంఖ్యలో భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. రాంసార్ కన్వెన్షన్ లో ఉన్న మహాప్రతాప్ సాగర్ వలస పక్షులని ఆకర్షించడం ద్వారా పక్షి ప్రేమికులకు ఎంతో ముఖ్యమైన ప్రాంతంగా పేరు పొందింది.
కాంగ్రాలో ఉన్నషాపుర్ మరియు నూర్పూర్ మధ్యలో హైవే పైన కోట్లా ఫోర్ట్ ఉంది. పర్యాటనకు ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది. చుట్టు పక్కల ఉన్న అందమైన లోయలు మరియు అద్భుతమైన దృశ్యాలు ఈ కోట పైనుండి చూసే పర్యాటకులకు చక్కటి కనువిందు కలిగిస్తాయి. గులేర్ రాజుల కాలంలో ఈ కోట నిర్మితమైంది. ఈ కోట ప్రాంగణంలో ఉన్న బాగుల్మికి ఆలయం చాలా మంది పర్యాటకులని ఆకర్షిస్తోంది.
దక్షిణ కాంగ్రా నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మసృర్ టెంపుల్ కాంప్లెక్స్ కాంగ్రాలో ఉన్న ప్రధాన పర్యాటక మజిలీ. 10 వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం ఏక శిలతో ఇండో-ఆర్యన్ శైలిలో నిర్మితమై ఉంది. అజంతా ఎల్లోరా ఆలయాలను పోలి ఉంది. ఈ సముదాయంలో 15 ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయంలో హిందువుల దైవం అయిన శ్రీ రాముడు, లక్ష్మణుడు మరియు సీతా మరియు శివుడు కొలువుదీరి ఉంటారు.
దులాధర్ రేంజ్, బ్రజేశ్వరి టెంపుల్, నదౌన్, కత్ గర్, జవాలిజి టెంపుల్, కాంగ్రా ఆర్ట్ గ్యాలరి, సుజన్పూర్ ఫోర్ట్, జడ్జ్ కోర్ట్ మరియు శివా టెంపుల్ ఈ ప్రాంతంలో ఉన్న మరికొన్ని ప్రధాన పర్యాటక ఆకర్షణలు. వీటితో పాటు ధర్మశాల, బెహన మహాదేవ, పాంగ్ లేక్ సాంచురీ, సిద్ధనాథ టెంపుల్, మాక్లియోడ్ గంజ్, తరాగర్హ్ పాలసు మరియు నాగర్ కోట్ ఫోర్ట్ వంటివి ప్రముఖమైన ఆకర్షణలు.
ప్రతి సంవత్సరం డిసెంబర్ లో నిర్వహించే అంతర్జాతీయ హిమాలయన్ ఫెస్టివల్ ఈ ప్రాంతంలో జరిగే ముఖ్యమైన పండుగ. శాంతి ప్రతిపాదనలు అందించిన దలైలామాకి వచ్చిన నోబెల్ ప్రైజ్ ని పురస్కరించుకుని ఈ వేడుకని జరుపుతారు. టిబెటన్ లలో సామరస్యాన్ని ప్రోత్సహించడమే ఈ వేడుక యొక్క ముఖ్య ఉద్దేశం.
సైట్ సీయింగ్ లతో పాటు కాంగ్రా చేరే దారిలో ట్రెక్కింగ్ ద్వారా పర్యాటకులు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలని చూసి ఆస్వాదించవచ్చు. కరేరి లేక్ మరియు మసృర్ టెంపుల్ లకి చేర్చేందుకు ఎన్నో సాహసోపేతమైన ట్రెక్కింగ్ దారులు కలవు. కాంగ్రా నుండి చంబా లోయకి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు. ఇందేర్హర పాస్ గా ప్రసిద్ది చెందిన లకాపాస్ మరియు మింకియాని పాస్ లు ఈ ప్రాంతంలో ప్రసిద్దమైన ట్రెక్కింగ్ దారులు. కాంగ్రా లోయలో మరిన్ని ప్రసిద్దమైన ట్రెక్కింగ్ దారులు కలవు.
అవి ధర్మశాల-లకా పాస్, మక్ లియోడగంజ్-మినికియాని పాస్-చంబ, ధర్మశాల-తలంగ్ పాస్, బైజ్నాథ్-పరాయి జోట్,మరియు భీం గసుత్రి పాస్.
విమాన, రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా ఈ ప్రాంతానికి సులభంగా చేరుకోవచ్చు. మార్చ్ లో మొదలై జూన్ వరకు కొనసాగే ఎండాకాలం ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు మంచి సమయం. ఆహ్లాదకరమైన మరియు అనుకూలమైన వాతావరణం వల్ల వర్షాకాలం కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు మంచి సమయం.