ఇండియాకి, టిబెట్ కి సరిహద్దు రాష్ట్రం అయిన హిమాచల్ ప్రదేశ్ లో లాహౌల్ వుంది. ఇక్కడి వారు తెల్లటి మేని ఛాయతో, తేనె రంగు కళ్ళతో ఇండో-ఆర్యన్, టిబెటన్ జాతికి చెందిన వారు. ఎక్కువ మంది భౌద్దాన్ని అనుసరిస్తూ బౌద్ధ సాంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తారు. బౌద్ధ విహారాలపై రెపరెపలాడుతూ కనిపించే ప్రార్ధనా జండాలు ఈ ప్రాంతానికి ముఖ్య చిహ్నాలు. ఈ విహారాలన్నీ ఇక్కడి ప్రజల ధార్మిక ధోరణిని ప్రతిబింబిస్తాయి.
బీడు భూములు అవడం వల్ల ఇక్కడ గడ్డి, పొదలు మాత్రమె పెరుగుతాయి. బంగాళా దుంపల సాగు, పాడి, నేత పని ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి.
గోడలు లోపలికి 10 డిగ్రీల వాలుతో వుండేలా ఇక్కడ ఇళ్ళను టిబెట్ నిర్మాణ శైలిలో నిర్మించారు. చెక్క, రాళ్ళు, సిమెంట్ లాంటి పదార్ధాలతో ఈ ఇళ్ళను కడతారు – ఇలాంటి పదార్ధాలు భూకంప ప్రమాదం వుండే చోట ఎక్కువగా వాడతారు.
అడవి దున్నలు, డోజోల్లాంటి జంతువులు ఇక్కడ స్వేచ్చగా తిరుగాడుతూ కనిపిస్తాయి. ఇక్కడ వృక్ష సంపద తరిగిపోవడంతో టిబెటన్ దుప్పి, ఆర్గలి, కియాంగ్, మస్క్ జింక, మంచు చిరుతలు లాంటి జంతువులను ప్రమాదంలో వున్న జాతులుగా ప్రకటించారు.
విహారాలకు, కిబ్బర్ వన్యప్రాణి అభాయారణ్యానికి ప్రసిద్ది పొందిన కిబ్బర్ గ్రామం ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ. పిన్ వాలీ నేషనల్ పార్క్, కీ విహారం, కున్ జుమ్ పాస్ ఇక్కడి ఇతర ఆకర్షణలు.
న్యూ డిల్లీ, షిమ్లా లాంటి ప్రధాన నగరాలకు అనుసంధానం చేయబడిన భుంటార్ లాహౌల్ కి సమీప విమానాశ్రయం. విమానాశ్రయం నుంచి లాహౌల్-స్పితి చేరడానికి టాక్సీలు, కాబ్ లు తేలిగ్గా దొరుకుతాయి. జోగీందర్ నగర్ ఇక్కడికి సమీపంలోని చిన్న రైల్వే స్టేషన్ కాగా, ప్రధాన రైల్వే స్టేషన్ చండీఘర్ నుంచి అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు నడుస్తాయి. రోహతంగ్ పాస్, కున్ జుమ్ పాస్, కిన్నౌర్ ల గుండా రోడ్డు మార్గంలో లాహౌల్ చేరుకోవచ్చు.