india tour header

Yuna / యూనా

Yuna / యూనా
యూనా జిల్లా హిమాచల్ ప్రదేశ్ లో శ్వాన్ నది తీరంలో ఒక ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. యూనా జిల్లాలో అనేక టూరిస్ట్ పర్యాటక ప్రాంతాలు కలవు. యునా పట్టణంలో అనేక మతపరమైన క్షేత్రాలు కలవు. వాటిలో గురుద్వారా డేరా బాబా భార్భాగ్ సింగ్, బాగాన లాథిఅన్, పిప్లు, చిన్త్పుర్ని టెంపుల్ మొదలైనవి ప్రసిద్ధి గాంచిన పర్యాటక కేంద్రాలు. గురుద్వారా డేరా బాబా భారభాగ సింగ్ సిక్కు మతస్థులలో బాగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం.
ఈ క్షేత్రం యునాకు 40 కి.మిల దూరంలో ఒక కొండపై చుట్టూ విస్తారమైన యూకలిప్టస్ వృక్షాలతో కనువిందు చేస్తుంది. పర్యాటకులు లాథిఅన్ పిప్లు, కూడా సోలా సిన్ఘి దార్ ల నుండి చూడవచ్చు. ఈ ప్రదేశం సమీపంలో కల గోవింద్ సాగర్ లేక్ చూడదగ్గది.
చిన్తపుర్ని టెంపుల్ లో హిందూదేవత చిన్తపుర్ని అమ్మవారిది. సోలా సిన్ఘి దార్, భార్వైన్, ది కుట్లేహార్ ఫోర్ట్, శీతల దేవి టెంపుల్, బాబా రుద్రానంద్ ఆశ్రమం, మరియు అంబ వంటివి మరికొన్ని పర్యాటక ఆకర్షణలు.
యునా సందర్శాంలనుకునే వారు మార్చ్ నుండి మే నెల మధ్యలో వేసవి కాలంలో చేరాలి. ఈ సమయం లో ఈ ప్రాంత వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుంటుంది. విమాన, రైలు మరియు రోడ్ మార్గాలలో యునాకు చక్కటి రవాణా సౌకర్యాలు కలవు.