header

Annapoorneswari Temple/ అన్నపూర్ణేశ్వరి దేవాలయం

Annapoorneswari Temple/ అన్నపూర్ణేశ్వరి దేవాలయం
కర్నాటకలోని పడమటి కనుమలలో భద్ర నది ఒడ్డున ఉన్న అన్నపూర్ణేశ్వరి దేవాలయాన్ని తప్పక చూడాలి. దీనినే శ్రీ క్షేత్ర హొరనాడు అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం చుట్టూ అడవులు, పచ్చటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పురాతన దేవాలయాన్ని పునరుద్ధరించి దానికి ఆది శక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవాలయంగా నామకరణం చేశారు.
ఈ దేవాలయంలో పర్యాటకులు మాత అన్నపూర్ణేశ్వరి శ్రీ చక్రాన్ని, చక్ర, శంకు ధరించి చూస్తారు. దేవి గాయత్రి మాత నాలుగు చేతులతో దర్శనమిస్తుంది. ఎన్నో శతాబ్దాల కిందట, ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి విగ్రహం ఆగస్త్య మహర్షిచే ప్రతిష్టించబడింది.
అన్నపూర్ణేశ్వరి అంటే అందరికి అన్నం పెట్టే తల్లి అంటారు. ఇక్కడ భక్తులకు రోజూ మూడు సార్లు భోజనాలు పెడతారు. నిద్రించేందుకు వసతి చూపుతారు.