

ఈ గుహాలయాలు హిందూ, జైన మరియు బౌద్ధులకు చెందిన సముదాయం. ఈ గుహలు భారతీయ శిల్పకళకు అద్దం సడతాయి
వీటి విశిష్టత గురించి చెప్పాలంటే... ఇవి భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోనే ప్రసిద్ధగుహలు. ఎర్రని రాతితో ఉండే ఈ గుహలు చూపరులను ఆకట్టుకుంటాయి. ప్రసిద్ధ పర్యాటక క్షేత్రంగా పేరు పొందిన ఈ ప్రదేశం ఒకప్పుడు తూర్పు చాళుక్యులకు నివాస స్థలం. చాళుక్యుల శిల్పకళాభిరుచికి ఈ గుహలు చక్కని ఉదాహరణ. నటరాజస్వామి, మహిషాసుర మర్దిని, గణపతి, నెమలి వాహనంపై కుమారస్వామి, విష్ణుమూర్తి శిల్పాలు మనోహరంగా ఉంటాయి
బాదామి ఉత్తర కర్నాటక లోని బాగల్ కోట జిల్లాలో గల ఒక పురాతన పట్టణం
భాదామి లోయ చుట్టూ బంగారు రంగు కల ఇసుక తిన్నెలు కనువిందు చేస్తాయి. ఇదివరకు బాదామిని వాతాపి అని పిలిచేవారు. అప్పటిలో దక్షిణ భారతదేశంలో ఈ ప్రాంతంలో అత్యధిక దేవాలయాల నిర్మాణాలు జరిగేవి. బాదామి గుహ దేవాలయాలకు ప్రసిద్ధి.
బాదామిలో నాలుగు గుహ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో మూడు హిందువులవి కాగా నాలుగవది జైన్ దేవాలయం.
మొదటి గుహ శివ భగవానుడికి చెందినది. అయిదు అడుగుల నటరాజ విగ్రహం 18 చేతులుతో ఉండి వివిధ ముద్రలు, నాట్య భంగిమలు కలిగి ఉంటుంది. ఈ గుహలో మహిషాసురమర్దిని విగ్రహం కూడా ఉంది.
రెండవ గుహలో శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ప్రతిష్టించారు భూ వరాహ మరియు త్రివిక్రమ రూపాలు ఈ గుహ తూర్పు మరియు పడమర గోడల మీద చెక్క బడ్డాయి. సీలింగ్ పై భాగంలో బ్రహ్మ, విష్ణు, శివ, అనంతశయన, అష్టాదిపాలకుల మూర్తులు ఉంటాయి.
మూడవ గుహ అలంకరణలతో అద్భుతంగా ఉంటుంది. బాదామి అపురూప శిల్ప సంపద అంతా ఇందులోనే ఉంటుంది. దీనిలో అనేక హిందూ దేవతలు మూర్తులు చెక్కబడ్డాయి. దీనిలోని గోడలపై చెక్కబడిన లిపి ఆధారంగా ఈ దేవాలయం క్రీ.శ 578 కి చెందినదిగా భావించబడుచున్నది.
నాలుగవ గుహ జైన్ దేవాలయం. ఇందులోని ప్రధాన మూర్తులు జైన రుషులు...మహావీర మరియు పార్శ్వనాధులు. ఈ దేవాలయం లోని కన్నడ లిపి మేరకు ఇది 12వ శతాబ్దానికి చెందినదని తెలుస్తోంది. గుహ దేవాలయాలే కాక, మూడు శివ మందిరాలు కూడా ఉత్తర దిక్కున ఉన్న కొండపై ఉన్నాయి. వీటిలో మాలేగట్టి శివాలయ చాలా ప్రసిద్ధి. ఇతర దేవాలయాలు భూతనాధ దేవాలయం, మల్లికార్జున దేవాలయం, దత్తాత్రేయ దేవాలయం.
బాదామిలో ఒక కోట గూడా ఉంది. ఇందులో కూడా అనేక దేవాలయాలున్నాయి. కొండలు ఎక్కటంలో ఆసక్తి కలవారు ఈ కొండలు ఎక్కేందుకు ప్రయత్నించవచ్చు.
బాదామి ఒక మంచి పర్యాటక స్థలం. బాదామి లోయ, పురాతన గుహ దేవాలయాలు, కోట ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. చాళుక్యుల కాలంనాటి శిల్ప సంపదలు చూడాలంటే బాదామి దేవాలయ సముదాయాలు తప్పక చూడవలసినవే.
బాదామిలో వసతి సదుపాయాలు ఉండవు. కాబట్టి బాగల్కోట్లో బస చేసి రోడ్డు మార్గంలో బాదామి గుహలను చేరడం అనువుగా ఉంటుంది.
కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లాలోని బాదామి ప్రాంతంలో ఉన్నాయి. బాదామి క్షేత్రం బీజాపూర్ నుంచి హుబ్లీ వెళ్లే దారిలో ఉంది. బాదామి రైల్వే స్టేషన్కు మూడు కిలోమీటర్లు దూరంలో బాదామి గుహలు ఉన్నాయి