

హొరనాడు పట్టణంలో ఉన్న అన్నపూర్ణేశ్వరి దేవాలయం తప్పక చూడాలి. ఈ పచ్చటి పట్టణం మల్నాడు ప్రాంతంలో చిక్కమగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన అడవులతో ఎంతో సారవంతమైన ప్రదేశాలు, లోయలు కలిగి ఉంది. ఈ ప్రత్యేకతలతో ఉన్న హొరనాడు పట్టణం అంటే ఇష్టపడని వారుండరు.
పకృతి అందాలే కాక, హొరనాడు పట్టణ సందర్శనలో మాత అన్నపూర్ణేశ్వరి దేవాలయం కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకొంటాయి ఈ దేవత విగ్రహం బంగారంతో తయారు చేయబడింది. ఈ పుణ్యక్షేత్రం సందర్శించిన యాత్రికులకు తమ జీవితంలో ఆహార కొరత ఉండదని నమ్ముతారు. ఇతిహాసాల మేరకు శివ భగవానుడు ఒకప్పుడు శపించబడగా, ఈ మాత ఆశీర్వాదాలతో ఆ శాపం వరంగా మారిందని కూడా చెపుతారు. ఈ దేవాలయం సందర్శించిన ప్రతి యాత్రికుడికి రుచికర ఆహారం మాత్రమేకాదు, చక్కగా నిద్రించేందుకు స్ధలంగూడా ఇవ్వబడుతుంది.
హొరనాడు సందర్శించేవారు సమీపంలోనే ఉన్న ఇతర దేవాలయాలు కూడా సందర్శించవచ్చు. శృంగేరి ఇక్కడకు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. హొరనాడు వెళ్ళే మార్గంలో ధర్మస్ధల మరియు ఉడుపి క్రిష్ణ దేవాలయాలను కూడా సందర్శించవచ్చు.
బెంగుళూరు నుండి హొరనాడుకు 330 కిలోమీటర్ల దూరం. దీనికి సమీప రైలు స్టేషన్ షిమోగా. సమీప విమానాశ్రయం మంగుళూరు.